China Pakistan Call : కాల్పులు ఆపండి Andhra prabha News

China Pakistan Call : కాల్పులు ఆపండి Andhra prabha News
- శాంతికి చర్చలు జరపండి
- ఆర్థిక వ్యవస్థకు హోర్ముజ్ అత్యవసరం
- నౌకలను వదలండి
- మధ్యప్రాచ్యంలో కాల్పుల విరమణకు పాక్-చైనా పిలుపు
- బీజింగ్‌లో దౌత్య చర్చలు
- హోర్ముజ్ జలసంధి ప్రాధాన్యం
- నౌకల భద్రతపై ఆందోళన
- ఇరాన్-గల్ఫ్ దేశాల సార్వభౌమత్వంపై సానుకూలత
- మధ్యవర్తిగా పాకిస్తాన్ పాత్ర
- కీలక మౌలిక సదుపాయాలపై దాడులు ఆపాలని విజ్ఞప్తి
- శాశ్వత శాంతికి ఐక్యరాజ్యసమితి పాత్ర
( ఆంధ్రప్రభ, బీజింగ్ ప్రతినిధి)
China Pakistan Call : మధ్యప్రాచ్చంలో తక్షణ కాల్పుల విరమించి , శాంతికి చర్చలు జరపాలని చైనా, పాకిస్తాన్ జంట పిలుపుని ఇచ్చింది. బీజింగ్ లో మంగవారం చైనా, పాకిస్థాన్ దౌపాక్షిక చర్చలు జరిపాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కీలక మార్గం హోర్ముజ్ జలసంధి మీదుగా వాణిజ్య, పౌర నౌకల సురక్షిత ప్రయాణానికి ఏర్పాట్లు చేయాలని, ఆ జలమార్గంలో చిక్కుకున్న ‘నౌకలు సిబ్బంది భద్రతను కాపాడాలని’ ఈ జంట దేశాలు అన్ని పక్షాలను కోరాయి. “శత్రుత్వాలను తక్షణమే విరమించుకోవాలని, ఘర్షణ నిరోధానికి గరిష్ట ప్రయత్నాలు చేయాలని చైనా, పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖలు ఒక సంయుక్త ప్రకటనలో కోరాయి.
China Pakistan Call : “ఇరాన్, గల్ఫ్ దేశాల సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత, జాతీయ స్వాతంత్య్రం భద్రతను పరిరక్షించాలి,” అని కోరారు. న్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్, చైనా సహచరుడు వాంగ్ యీ మధ్య భేటీ అనంతరం ఈ ప్రకటన వెలువడింది. ఈ సమావేశంలో మధ్యప్రాచ్యం అంతటా తీవ్రమవుతున్న సంఘర్షణపై చర్చించారు.
China Pakistan Call : ఈ వారాంతంలో పాకిస్తాన్, సౌదీ అరేబియా, ఈజిప్ట్, టర్కీ తో కలిసి చతుర్ముఖ భేటీకి ఆతిథ్యం ఇవ్వాలని, అంతక ముందు, ఇరాన్ అమెరికా తో తమ స్నేహపూర్వక బంధాలను ఉపయోగించాలని , అమెరికా యొక్క 15-సూత్రాల ప్రణాళికను ఇరాన్ కు అందించడంలో పాకిస్తాన్ ఒక కీలక మధ్యవర్తిగా అవతరించింది.
China Pakistan Call : ఈ తాజా దౌత్య ప్రయత్నంలో, పౌరులపై “ఇంధనం, డీశాలినేషన్, విద్యుత్ కేంద్రాలు, శాం తియుత అణు కేంద్రాలు వంటి కీలక మౌలిక సదుపాయాలపై” దాడులను తక్షణమే నిలిపివేయాలని పాక్ చైనా జంట అన్ని పక్షాలకు కోరాయి. “శాశ్వత” శాంతి కోసం ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ చట్టాల ప్రాధాన్యతను నిలబెట్టాలని కూడా పాక్, చైనా కోరాయి.
