చిట్యాలలో చిన్నారుల హోలీ సంబరాలు..

చిట్యాల, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలో మంగళవారం హోలీ సంబరాల్లో చిన్నారులు, రంగులను చల్లుకుంటూ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. చిన్నారుల హోలీ వేడుకలను పెద్దలు ఆసక్తిగా చూశారు. ఈవేడుకలలోచిన్నారులు,తాటిపల్లి వేదాన్ష్, కౌశిక్, పెరుమాండ్ల హర్ష, కృషిక, వలబోజు హాసిని, వల్లాల అంజుశ్రీ, చైత్ర, తదితరులు పాల్గొన్నారు. మంగళవారం చంద్రగ్రహణం కారణంగా మండలంలో హోలీ వేడుకలు బుధవారం కూడా ప్రజలు జరుపుకోనున్నారు.
