చెస్ రేటింగ్ సాధించిన విద్యార్థినికి అభినంద‌న‌…

చెస్ రేటింగ్ సాధించిన విద్యార్థినికి అభినంద‌న‌…

అంతర్జాతీయ చెస్ క్రీడాకారుడిగా గుర్తింపు

పాయకాపురం, ఆంధ్రప్రభ : అంతర్జాతీయ చెస్ క్రీడాకారుడిగా గుర్తింపు సాధించాలని ఋషి విద్యాలయం కరస్పాండెంట్ టి. శ్రీనివాసరావు అన్నారు. ఇటీవల తమిళనాడు రాష్ట్రంలో జరిగిన అంతర్జాతీయ చెస్ రాపిడ్ ర్యాంక్ టోర్నమెంట్ నిర్వహించారు.

ఈటోర్నీలో పాయకాపురం ప్రాంతానికి చెందిన ఋషి విద్యాలయం విద్యార్థి ఆకుల లికిత్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్కి సంబంధించి 1494 రాపిడ్ ర్యాంక్ సాధించాడు. ఇందుకుగాను చెస్ క్రీడాకారుడు లికిత్ను సోమవారం జరిగిన స్కూల్ అసెంబ్లీ సెషన్స్లో కరస్పాండెంట్ టి శ్రీనివాసరావు, చెస్ మాస్టర్ రామకృష్ణ అభినందించారు. మరెన్నో విజయాలు సాధించాలని వారు కోరారు.

Leave a Reply