Chaudhapur | ఠాణా వచ్చేది ఎప్పుడో..

- చౌడాపూర్ మండలానికి నోచుకోని పోలీస్ స్టేషన్..
- చౌడాపూర్ నూతన మండల కేంద్రంగా ఏప్రిల్ 2021న ఏర్పాటు..
- ఐదు సంవత్సరాలు కావస్తున్నా
- ఏర్పాటు చేయని పోలీస్ స్టేషన్..
- ప్రజలను తాగుబోతులుగా మార్చేందుకు వైన్స్ ఏర్పాటు..
చౌడాపూర్, (ఆంధ్రప్రభ) : చౌడాపూర్ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటంచినప్పుడు చౌడాపూర్ (Chaudhapur) గ్రామంతో పాటు ఆయా గ్రామపంచాయతీ ల ప్రజలకు సంతోషంతో పాటు అంతులేని ధీమగా మారింది. కలను నెరవేర్చిన నేతలు కార్యాలయాల ఏర్పాటులో హడావిడిగా తహసీల్దార్ కార్యాలయాన్ని, వ్యవసాయ, విద్యాశాఖ, ఎంపీడీవో కార్యాలయాలను ప్రారంభించి శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన పోలీస్ స్టేషన్‌ను మాత్రం విస్మరించారు.
చౌడాపూర్ గ్రామంతో పాటుగా పరిసర గ్రామాల కోరిక మేరకు తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్ 24వ తేది 2021న 14 రెవెన్యూ గ్రామాలతో చౌడాపూర్ గ్రామాన్ని మండల కేంద్రం చేసి రెవెన్యూ మండలం ఏర్పాటుకు గెజిట్ విడుదల చేసింది. అనంతరం జూన్ 11న తహసీల్దార్ కార్యాలయం మండల విద్యాధికారి కార్యాలయాన్ని ప్రారంభించా రు. చౌడాపూర్ పోలీస్ స్టేషన్‌కు ఎంపిక చేసిన కార్యాలయానికి గ్రామపంచాయతీ కార్యాలయాన్ని చేశారు.
గత నెలలో ప్రారంభించిన ఎంపీడీవో కార్యాల యంలో పూర్తిస్థాయిలో లేని అధికాలు మండలం ఏర్పాటై ఐదు సంవత్సరలు కావస్తున్నా ఇంత వరకు పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయలేదు. ప్రభుత్వ కార్యాలయలల్లో పనిచేస్తున్న అధికారులు కొంత వరకు డిప్యుటేషన్‌పై వచ్చిన వారే తప్పా పూర్తిస్థాయిలో నియమింపబడని పరిస్థితి నెలకొంది. తహసీల్దార్, ఎంపీడీవో తదితర కార్యాలయాల ప్రారంభంలో చూపిన ఉత్సాహాన్ని పోలీస్ స్టేషన్ ఏర్పాటులో ఎందుకు చూపడం లేదని ప్రజలు నాయకుల తీరుపై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.
క్షేత్రస్థాయిలో పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు ఉపయోగ కరంగా ఉన్న కార్యాలయ భవనాన్ని మార్పు చేసి గ్రామపంచాయతీకి కేటాయించారు. గ్రామ పంచాయ తీల తీర్మానంతో పాటుగా జిల్లా పాలనాధికారుల నివేదికను రాష్ట్ర పోలీసు శాఖకు పంపించినప్పిటికీ అక్కడి నుంచి ఇప్పటివరకు ఎలాంటి ఆదేశాలు అందకపోవడంతో పోలీస్ స్టేషన్ ఏర్పాటు ఇప్పట్లో అయ్యేనా అని మండల ప్రజలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తే శాంతి భద్రతలు పూర్తిస్థాయిలో కాపాడవచ్చని మండల ప్రజలు అన్నారు.
Chaudhapur | ప్రజలను తాగుబోతులుగా మార్చేందుకు వైన్స్..
చౌడాపూర్ మండలం నూతనంగా ఏర్పాటు అయ్యింది. కానీ ఇప్పటి వరకు చౌడాపూర్ మండల కేంద్రానికి పోలీస్ స్టేషన్ మాత్రం నోచుకోలేదు… ప్రజలకు సంబంధించిన పోలీస్ స్టేషన్ ఇప్పటి వరుకు ఏర్పాటు చేయలేదు కానీ ప్రజలను తాగుబోతులుగా మార్చేందుకు వైన్స్ దుకాణాలను మంజూరు చేశారు. మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తే రోడ్డు ప్రమాదాలు కూడా కొంత వరకు తగ్గుతాయని మండల ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నూతన పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరారు.
