Challapalli Ps Blast : చల్లపల్లి పీఎస్ లో పేలుడు Andhra Prabha Latest News

Challapalli Ps Blast : చల్లపల్లి పీఎస్ లో పేలుడు Andhra Prabha Latest News

  • బాణాసంచ బీభత్సం
  • పోలీసుల చేతిలో పేలిన టపాసులు
  • ఎస్సై సహా ముగ్గురికి గాయాలు

(ఆంధ్రప్రభ – కృష్ణా బ్యూరో )

Challapalli Ps Blast

Challapalli Ps Blast : కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్ లో బీభత్స ఘటన చోటు చేసుకుంది. గతంలో అక్రమంగా నిల్వ ఉంచిన టపాసులను స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిని కోర్టులో సబ్మిట్ చేయాల్సి ఉంది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం టపాసులను కోర్టు కానిస్టేబుల్ అబ్దుల్లా బయటకు తీసుకురాగా, ఫోటోలు తీద్దామని అనుకునే సమయంలో ఒక్కసారిగా టపాసులు పేలడంతో భారీ శబ్దం వినబడింది.

Challapalli Ps Blast

కోర్టు కానిస్టేబుల్ అబ్దుల్లాకు తీవ్ర గాయాలు అవ్వడం జరిగింది. దీంతో పాటు ఎస్ఐ దుర్గాంజనేయులుకు స్వల్ప గాయాలయ్యాయి. హెడ్ కానిస్టేబుల్ తేజ, డ్రైవర్ నాగరాజుకు సైతం గాయాలు కావడంతో స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అబ్దుల్లాకు తీవ్ర గాయాలు కాగా, పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లోని వారు ఒకేసారి భయంతోంది. స్టేషన్ వద్దకు చేరుకున్నారు. పోలీస్ స్టేషన్లో ఉన్న మహిళా కానిస్టేబుల్, మరో హోంగార్డుకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు.

Challapalli Ps Blast

పేలుడు దాటికి పోలీస్ స్టేషన్లో ఉన్న భవనం స్లాబు హెచ్చులు ఊడాయి. తలుపులు సైతం పగిలిపోయాయి. స్టేషన్లో ఉన్న వాహనం అద్దాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వాహనం ఒకపక్క రెండు డోర్లు దెబ్బతిన్నాయి. సుమారు అర కిలోమీటర్ దూరం శబ్దం వినపడడంతో పరిసర ప్రాంతాల వారు హుటాహుటిన పోలీస్ స్టేషన్ కు వచ్చారు. అబ్దుల్లాకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఎన్నడూ లేని విధంగా చల్లపల్లి పోలీస్ స్టేషన్ లో ఈ ఘటన జరగడంతో భయాందోళనకరమైన పరిస్థితి నెలకొంది.

ALSO READ : 34 Passengers Safe: త‌ప్పిన మ‌హా ఘోరం An dhra Prabha News

Leave a Reply