Central Andhra | ఆలయాన్ని పున‌రుద్ధ‌రించండి!

  • బొల్లుమార వెంకటేశ్వర స్వామి ఆల‌య పున‌రుద్ధ‌ణ ప‌నులు చేప‌ట్టాలి
  • జ‌న‌సేన పార్టీ సెంట్రెల్ ఆంధ్ర కో-క‌న్వీన‌ర్ పెంటేల బాలాజీ

Central Andhra | చిల‌క‌లూరిపేట‌, ఆంధ్రప్రభ : కొండ‌వీడు కొండ‌పై కొలువైన‌ బొల్లుమార వేంకటేశ్వర స్వామి(Bollumara Venkateswara Swami) దేవాల‌యానికి చేరుకోవ‌డానికి ఘాట్ నిర్మాణం చేయాల‌ని జ‌న‌సేన పార్టీ సెంట్రెల్ ఆంధ్ర(Central Andhra) కో క‌న్వీన‌ర్ పెంటేల బాలాజీ కోరారు. ఆ గ్రామానికి చెందిన ప‌లువురు దేవాల‌యానికి ఘాట్ రోడ్డు నిర్మాణం చేప‌ట్టాల‌ని, స‌మ‌స్య‌ను ప్ర‌భుత్వం దృష్టికి తీసుకెళ్లి ప‌రిష్క‌రించాల‌ని కోరుతూ బాలాజీని క‌లిశారు.

విష‌యంపై స్పందించిన బాలాజీ గ్రామ‌స్తుల‌తో క‌ల‌సి డిప్యూటీ సీఎం, అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్(Minister Pawan Kalyan) దృష్టికి తీసుకెళ్లాలని జనసేన జనవాణిలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కళ్యాణం శ్రీనివాస్ రావుకి అర్జీ అందించారు.

Central Andhra |అతి ప్రాచీనమైన‌ది

Central Andhra

ఈ సంద‌ర్భంగా బాలాజీ మాట్లాడుతూ.. య‌డ్ల‌పాడు మండ‌లం కొండవీడు కొండలలోని కొండపై వేంచేసి ఉన్న బొల్లుమార వేంకటేశ్వర స్వామివారి దేవాలయం శ్రీ కృష్ణ దేవరాయల(Shri Krishna Devarayala) కాలంలో నిర్మించబడిన అతి ప్రాచీనమైన‌దిగా వివ‌రించారు. ఈ దేవాలయానికి చేరుకోవ‌డానికి సరైన మెట్ల దారి లేదని, అయినా స్వామివారిని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు దర్శించుకుంటూ ఉంటారని తెలిపారు.

ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో స్వామివారికి గ్రామస్తులందరు కలసి కల్యాణం జరిపించి అన్న ప్రసాద వితరణ కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తార‌ని తెలిపారు. గ‌తంలో ఘాట్ రోడ్డు నిర్మాణం గ్రామ‌స్తులే స్వ‌యంగా దారిని క్లీన్ చేస్తుండ‌గా అటవీ శాఖ అధికారులు ఘాట్ రోడ్డునకు అనుమ‌తి లేదని నిలిపివేశార‌ని గుర్తు చేశారు.

Central Andhra | ఘాట్ రోడ్డు నిర్మించాలి…

Central Andhra |

జనసేన పార్టీ అధికారంలోకి వస్తే స్వామి వారికి ఘాట్ రోడ్డు నిర్మించి భక్తులకు అందుబాటులోకి తీసుకొని వస్తామని గ్రామ పార్టీ నేత‌లు మొక్కుకొని ఉన్నార‌ని వెల్ల‌డించారు. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు(MLA Prathipati Pullarao) కూడా శాయశక్తులా కృషి చేస్తున్నారని తెలిపారు.

ఆధ్యాత్మికంగా అతి ప్రాచీనమైన బొల్లుమార వెంకటేశ్వర స్వామీ దేవాల‌యాన్ని పునఃరుద్ద‌రించి, స్వామి దేవాలయానికి ఘాట్ రోడ్డు నిర్మాణానికి అనుమతులు ఇప్పించి ఘాట్ రోడ్డు నిర్మాణ పనులు వచ్చే స్వామివారి కల్యాణం నాటికి పూర్తి చేసేలాగా చూడాల‌ని కోరారు. కార్య‌క్ర‌మంలో య‌డ్ల‌పాడు మండల ఉపాధ్యక్షుడు మేకల రామారావు, మండల ప్రధాన కార్యదర్శి పాపన హనుమంత రావు, కొత్తపాలెం గ్రామ ప్రధాన కార్యదర్శి పల్లె ఆదిబాబు, ఐలం హరిబాబు, కాకాని వెంకటేశ్వర రావు తదిత‌రులు ఉన్నారు.

Click Here To Read స్వ‌ర్ణ‌ధారుడై..

Click Here To Read More

Leave a Reply