1chance | సినీ హీరోలు రాజకీయాల్లోకి..

1chance | సినీ హీరోలు రాజకీయాల్లోకి..
1chance | విజయ్, పవన్ కళ్యాణ్ ప్రయాణం
- ఇండియాలో సినిమా రంగం నుండి రాజకీయాల దాకా
- తమిళనాడు, తెలుగు రాష్ట్రాల సూపర్ స్టార్ రాజకీయాలు
- విజయ్ రాజకీయ ప్రయాణం: ప్రారంభం, ప్రగతి
- ప్రస్తుతం పరిస్థితులు, నినాద ప్రాముఖ్యత
1chance | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఇండియాలో సినిమా రంగానికి చెందినవారు రాజకీయాల్లోకి రావడం కొత్తేమీ కాదు. పాపులర్ హీరోలు పార్టీలు స్థాపించి, ముఖ్యమంత్రులుగా ఎదిగిన ఉదాహరణలున్నాయి.
వారిలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్, తెలుగు రాష్ట్రాల్లో అపారమైన ప్రజాదరణ పొందిన ఎన్టీ రామారావు ముఖ్యులు. వీరితో పాటు జె. జయలలిత కూడా ఆరు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి అరుదైన రికార్డు సృష్టించారు.

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కూడా కొంతకాలం సినిమాలకు విరామం ఇచ్చి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అయితే ఆయన ఆశించిన స్థాయిలో విజయం సాధించ లేక 0పోయారు.
దక్షిణాదిలో విజయకాంత్, కమల్ హాసన్, సురేష్ గోపీ వంటి ప్రఖ్యాత వ్యక్తులు కూడా రాజకీయాల్లోకి ప్రవేశించారు. సూపర్ స్టార్ రజనీకాంత్ 2017లో రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించినప్పటికీ, ఆ ప్రకటన కార్యరూపం దాల్చలేదు.
ఇక ఆంధ్రప్రదేశ్‌లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించి మొదట్లో అపజయాలను ఎదుర్కొన్నా, ఓపికతో, సమర్థతతో నిలిచి, ఎన్నికల్లో గెలిచి, రాజకీయాల్లో తనకంటూ స్థానం సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆయన డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు.

అదే విధంగా తమిళంలో సూపర్ స్టార్‌గా పేరు సంపాదించిన దళపతి విజయ్ ఇటీవల ‘తమిళగ వెట్రి కజగం’ అనే రాజకీయ పార్టీని స్థాపించారు. ఇప్పుడు ఆయన రాజకీయ రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు.
త్వరలో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలబడేందుకు విజయ్ రెడీ అవుతున్నారు. ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసి ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రజల ముందుకు వెళ్లిన ఆయన “ఒక్క ఛాన్స్ ప్లీజ్” అంటూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.

ఇదే నినాదంతో గతంలో ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో ప్రజల ముందుకు వెళ్లి భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. అదే ఫార్ములాను విజయ్ కూడా అనుసరిస్తుండటం ఆసక్తికరంగా మారింది.
అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి. గతంలా హీరోలు పార్టీలు పెట్టగానే ప్రజలు ఓట్లు వేసే పరిస్థితి లేదు. ఓటర్లు ఇప్పుడు ఆలోచించి నాయకుడిని ఎంచుకుంటున్నారు.
1chance | ప్రేక్షకుల అభిప్రాయం, ఎదురుచూస్తున్న ఫలితాలు

ఇటీవలి కాలంలో పలువురు సినీ ప్రముఖులు రాజకీయాల్లోకి వచ్చి విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో విజయ్ “ఒక్క ఛాన్స్” నినాదం ఎంతవరకు ఫలితాన్నిస్తుందో అన్నది ఆసక్తికరంగా మారింది.
అభిమానులు తమ హీరోను గెలిపిస్తారా?
లేక రాజకీయాల్లో కూడా అదే స్థాయి విజయాన్ని సాధించడం అంత ఈజీ కాదని నిరూపిస్తారా?
దళపతి విజయ్ రాజకీయ ప్రయాణానికి ప్రజలు ఏ తీర్పు ఇస్తారో వేచి చూడాలి.
ఈ వ్యాసం కేవలం పాఠకుల్లో ప్రాధమిక అవగాహన కల్పించడానికి మాత్రమే అందించబడింది.
CLICK HERE TO READ MORE : actress Sunandini | నటి సునంధిని వ్యక్తిగత జీవితం: ఆసక్తికర విషయాలు వెల్లడి
CLICK HERE TO READ MORE :
