CCTV Camera | సంక్రాంతికి ఊరెళుతున్నారా? దొంగల పట్లజాగ్రత్త…

CCTV Camera | సంక్రాంతికి ఊరెళుతున్నారా? దొంగల పట్లజాగ్రత్త…
- చైనీస్ మాంజాను విక్రయించిన వాడిన కఠినచర్యలు.
CCTV Camera | ఊట్కూర్, ఆంధ్రప్రభ : సంక్రాంతి పండుగకు, విహారయాత్రలకు వివిధ గ్రామాలకు వెళ్లే ప్రజలు ఇండ్లలో దొంగతనాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని నారాయణపేట జిల్లా ఊట్కూర్ ఎస్సై రమేష్ ఈ రోజు ఒక ప్రకటనలో సూచించారు. ఎస్పీ డాక్టర్ వినీత్ ఆదేశాల మేరకు ఇళ్లలో దొంగతనాలు జరగకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలి. సెలవులకు వెళ్లే ముందు ఇంటి తలుపులు, కిటికీలు సక్రమంగా లాక్ చేయాలన్నారు. విలువైన వస్తువులు, నగదు, బంగారు ఆభరణాలను ఇంట్లో ఉంచకుండా బ్యాంకు లాకర్‌లలో భద్రపరచుకోవాలని కోవాలన్నారు. ఇంటి వద్ద వెలుతురు కోసం లైట్లు ఏర్పాటు చేయడం, నమ్మకమైన పొరుగువారికి సమాచారం ఇవ్వడం, అవసరమైతే సీసీటీవీ కెమెరాలను అమర్చుకోవడం వంటివి దొంగతనాల నివారణకు ఉపయోగపడతాయన్నారు. అలాగే, అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలు కనిపిస్తే వెంటనే పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్ 100/,112కు సమాచారం ఇవ్వాలన్నారు.
పండుగ రోజులలో పోలీస్ శాఖ ప్రత్యేక నిఘా, పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు పోలీసులతో సహకరించి అప్రమత్తంగా ఉంటేనే దొంగతనాలు పూర్తిగా నివారించవచ్చని పండుగ సందర్భంగా కోడిపందాలు ఆడటం గానీ, పేకాట ఆడడం గానీ చేసినట్లయితే అట్టి వ్యక్తులను పట్టుకొని చట్ట ప్రకారం కేసు నమోదు చేసి కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా మండల పరిధిలో పేకాట గాని, కోళ్ల పందాలు ఆడటం గాని చేసినట్లయితే సమాచారం ఇవ్వాలని పండగ సందర్భంగా పతంగులు ఎగరవేయడానికి ఉపయోగించే చైనీస్ మాంజా దారం ఉపయోగించినట్లయితే దానివల్ల పక్షులకు జంతువులకు మనుషులకు హాని జరుగుతుందని ఎవరైనా చైనీస్ మాంజాను విక్రయించిన, దాన్ని కొని ఉపయోగించిన వారిపైన చట్టరీత్యా చర్య తీసుకుంటామని హెచ్చరించారు.
