CC roads | ప్రచారంలో దూసుకుపోతున్న పెనుకుల రాజేందర్
CC roads | కమలాపూర్, ఆంధ్రప్రభ : కమలాపూర్ మండలంలోని వంగపల్లి గ్రామంలో భారతీయ జనతా పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి పెనుకుల రాజేందర్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. యువకుడిగా గ్రామ సమస్యలపై అవగాహన కలిగి ఉన్న రాజేందర్ ఒక్కసారి అవకాశం కల్పిస్తే వంగపల్లి గ్రామంలోని మౌలిక సదుపాయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తానన్నారు.
డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచి, ప్రతి కాలనీలో సీసీ రోడ్లు(CC roads) ఏర్పాటు చేసి గ్రామంలో ప్రస్తుతం నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తానని హామీ ఇస్తూ ప్రజలను ఓట్లు అభ్యర్థిస్తున్నాడు.
ఇంటింటి ప్రచారంలో భాగంగా రాజేందర్ ను ఓటర్లు ఘనంగా స్వాగతిస్తూ మా ఓటు నీకే వేస్తామని విజయోస్తు.. అంటూ దీవిస్తున్నారు. మాజీ మంత్రి, మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్(MP Etela Rajender) ఆశీస్సులతో సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగిన పెనుకుల రాజేందర్ ను భారీ మెజార్టీతో గెలిపించడానికి గ్రామస్తులు, ఓటర్లు సిద్ధంగా ఉన్నట్లు ఇక్కడ ప్రచారం జోరందుకుంది.
బ్యాట్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించి ఒక్కసారి అవకాశం కల్పించాలని అభ్యర్థి రాజేందర్ గడపగడపకు(Gadapagadapaku) ప్రచారం చేస్తూ ఓటర్లను అభ్యర్థిస్తున్నాడు. గ్రామంలో పార్టీలకతీతంగా ప్రతి ఓటరు రాజేందర్ విజయానికి ఇప్పటి నుండే సంకేతాలు ఇస్తున్నట్లు ఇక్కడ స్పష్టమవుతుంది.

