జన్నారం, ఏప్రిల్ 4 (ఆంధ్రప్రభ) : మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కలమడుగు గ్రామ శివారులోని ఓ కోళ్ల ఫారంలో రహస్యంగా డబ్బులు పెట్టి పందెంతో పేకాటాడిన 9మందిని అరెస్ట్ చేసి, ఆ నిందితుల నుంచి రూ.62వేలు, 9 మొబైల్ ఫోన్లు, పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నట్లు స్థానిక ఎస్సై గుండేటి రాజవర్ధన్ శుక్రవారం తెలిపారు.
తనతో పాటు కానిస్టేబుళ్ళు కె.చంద్రమౌళి, సురేష్ నాయక్, హోంగార్డు జవహర్, తదితరులు అక్కడికి వెళ్లి పేకాట ఆడుతున్న మండలంలోని కలమడుగు గ్రామానికి చెందిన తిర్రి శ్రీనివాస్ గౌడ్, శ్రీరాముల రాజేశం, జక్కుల తిరుపతి, మురిమడుగుకు చెందిన పోతుగంటి శ్రీనివాస్, నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలంలోని భుట్టాపూర్ చెందిన బందెల శంకర్, రేవోజిపేటకు చెందిన గంజి వెంకటేష్, మతులాపురం కృష్ణ, గొడిసెరాలకు చెందిన కొంపల్లి నర్సయ్యలు రహస్యంగా కలమడుగు శివారులోని ఓ కోళ్ల ఫారంలో డబ్బులతో పందెం పెట్టి, పేకాట ఆడిన ఆ 9 మందిని అదుపులోకి తీసుకొని, నిందితుల నుంచి రూ.62వేల నగదు, 9 సెల్ ఫోన్ లను, పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.