TG | కేటీఆర్‌పై కేసు కొట్టివేత

హైదరాబాద్ : కేటీఆర్‌పై సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసును తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రెచ్చగొట్టే విధంగా మాట్లాడారని ఎంపీ అనిల్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలని కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. రాజకీయ కక్షలతో తనపై కేసు నమోదు చేశారని వాదనల సందర్భంగా కేటీఆర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న న్యాయస్థానం ఎఫ్ఐఆర్‌ను కొట్టివేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *