బాపట్ల : కారు బోల్తా పడి ముగ్గురు మృతిచెందిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్ల జిల్లాలో చోటుచేసుకుంది. విహార యాత్రకు వెళ్తుండగా చీరాల దగ్గర కారు బోల్తాపడడంతో ముగ్గురు మృతిచెందగా, మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. రన్నింగ్ లో కారు చక్రం ఊడిపోవడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతులు కార్తీక్, నాయక్, అజయ్ గా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Bapatla | కారు బోల్తా… ముగ్గురు మృతి
