captain gill| మ్యాచ్ లేట్‌.. భారీ జ‌రిమానా

captain gill| మ్యాచ్ లేట్‌.. భారీ జ‌రిమానా

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ఐపీఎల్‌లో గుజరాత్ జట్టు మొదటి విజయం అందుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌పై థ్రిల్లింగ్ విక్టరీ తర్వాత గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు బిగ్ షాక్ త‌గిలింది. ఈ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కార‌ణంగా గిల్‌కు భారీ జరిమానా ప‌డింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా హై-స్కోరింగ్ మ్యాచ్ జ‌రిగింది. ఆఖ‌రిలో మ్యాచ్ ఉత్కంఠంగా మారింది. ఢిల్లీ ఆట‌గాడు డేవిడ్ మిల్లర్ ధాటిగా ఆడుతుండ‌టంతో కెప్టెన్ గిల్ ప‌దేప‌దే ఫీల్డింగ్‌లో మార్పులు, బౌల‌ర్ల‌కు స‌ల‌హాలు సూచ‌న‌లు ఇవ్వాల్సి వ‌చ్చింది. దీంతో ఇన్నింగ్స్ ముగియ‌డం నిర్ణీత సమయం కంటే ఆలస్యమైంది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం.. గుజరాత్ జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు రూ. 12 లక్షల జరిమానా ఐపీఎల్ కమిటీ విధించింది.

Leave a Reply