బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలుపు దిశగా ప్రచారం

బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలుపు దిశగా ప్రచారం

  • అభ్యర్థి పొన్న రాజేష్ ఇంటింటి ప్రచారం

స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డులో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పొన్న రాజేష్ గెలుపు దిశగా ప్రచారం జోరుగా నిర్వహిస్తు న్నారు. శుక్రవారం బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి రాజేష్ వార్డులో విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వార్డులోని ఓటర్లు బిఆర్ఎస్ అభ్య ర్థికే మద్దతు తెలుపుతున్నారు. వార్డులో బిఆర్ఎస్ పార్టీ జెండా ఎగర వేయడం ఖాయమని అభ్యర్థి ధీమా వ్యక్తం చేశారు. స్టేషన్ ఘన్ పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఘన్ పూర్ మున్సిపాలిటీ పరిధి లో ఎంతో అభివృద్ధి చేశారన్నారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ హయాం లో జరిగిన అభివృద్ధి పనులను గుర్తుచేస్తూ ప్రచారం నిర్వహించారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో 8వ వార్డులో పొన్న రాజేష్ గెలవడం ఖాయ మని ఓటర్లు అభిప్రాయం వ్యక్తం చేశారు.

Leave a Reply