bus stand l కలెక్టర్ తనిఖీలు..

bus stand l కలెక్టర్ తనిఖీలు..
బస్టాండ్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి
ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి
bus stand l కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ: బస్టాండ్ ప్రాంతాలను పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. ఎమ్మిగనూరు బస్టాండ్ లోని టాయిలెట్స్, షాపులు, హోటల్ లు తదితర విభాగాలను కలెక్టర్ పరిశీలించారు. బస్టాండ్ పరిసరాల్లో శానిటేషన్ సరిగా నిర్వహించకపోవడం, పబ్లిక్ టాయిలెట్ లో డోర్ లు లేకపోవడం, పరిశుభ్రత లేకపోవడం పట్ల కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసి, ఎమ్మిగనూరు ఆర్టీసీ డిపో మేనేజర్ కు షోకాజ్ నోటీసు జారీ చేయాలని కలెక్టర్ ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. బస్టాండ్ పరిసరాల్లో చెత్త పేరుకుపోకుండా ప్రతిరోజూ శుభ్రపరిచే చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆర్టీసీ అధికారులను ఆదేశించారు.
ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా టాయిలెట్ లను శుభ్రంగా ఉంచాలన్నారు. బస్టాండ్‌లోని హోటల్ ను తనిఖీ చేస్తున్న సమయంలో వంట చేయడానికి ye నూనె ఉపయోగిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. కమర్షియల్ అవసరాలకు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ వినియోగిస్తున్నట్లు గుర్తించి కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హోటల్ యాజమాన్యం పై తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డిఎస్ఓ ను ఆదేశించారు. షాపులను తనిఖీ చేస్తూ ఎమ్మార్పీ ధరల కంటే ఎక్కువ ధరకు వస్తువులను విక్రయించకూడదని కలెక్టర్ షాప్ యజమానులను హెచ్చరించారు. ప్రజారోగ్య పరిరక్షణ దృష్ట్యా పారిశుధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.
కార్యక్రమంలో ఆదోని ఇంచార్జి సబ్ కలెక్టర్ అజయ్ కుమార్, డిఎంహెచ్వో భాస్కర్, పౌరసరఫరాల శాఖ అధికారి రాజా రఘువీర్, కర్నూలు బస్ స్టాండ్ డిపో మేనేజర్, ఎమ్మిగనూరు డిపో మేనేజర్ మద్దిలేటి నాయుడు, తదితరులు పాల్గొన్నారు.
