పెద్దపోర్లకు బస్సు సౌకర్యం కల్పించాలని డిఎంకు వినతి….

పెద్దపోర్లకు బస్సు సౌకర్యం కల్పించాలని డిఎంకు వినతి….
ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని పెద్దపోర్ల గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ నారాయణపేట ఆర్టీసీ డిపో మేనేజర్ లావణ్యకు పెద్దపోర్ల గ్రామపంచాయతీ పాలకవర్గం సభ్యులు,నాయకులు మంగళవారం వినతి పత్రం సమర్పించారు. పాలమూరు పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణ పంపిన సిఫారసు లేఖను డిపో మేనేజర్ కు సమర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెద్దపోర్ల గ్రామ ప్రజలు విద్యార్థులు ప్రతినిత్యం నారాయణపేట జిల్లా కేంద్రానికి ఊట్కూర్ మండల కేంద్రంతో పాటు పలు ప్రాంతాలకు వెళ్తున్నారని బస్సు సౌకర్యం లేకపోవడంతో గేటు వరకు కాలినడకన నడుచుకుంటూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. గతంలో పలుమార్లు బస్సు సౌకర్యం కల్పించాలని వినతి పత్రం సమర్పించినట్లు గుర్తుచేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ బోయిన్ పల్లి కాశమ్మ, మాజీ సర్పంచ్ రవికుమార్, నాయకులు నరేష్ కుమార్, వెంకటేష్, వెంకట్, రాము, సత్యం అంజితదితరులుపాల్గొన్నారు.
