బీఆర్ఎస్ నేత మృతి…..

బీఆర్ఎస్ నేత మృతి…..

వ‌రంగ‌ల్ సిటి బ్యూరో, ఆంధ్ర‌ప్ర‌భ : వరంగల్ నగర శివారులో బీఆర్ ఎస్ నేత లాదెళ్ల రాజు అలియాస్‌ లవ్ రాజు అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. గొర్రెకుంట ప్రాంతానికి చెందిన బీఆర్ ఎస్ మాజీ అధ్యక్షుడు ల్యాదేల రాజు మృతదేహం మొగిలిచర్ల సమీపాన గల శ్మ‌శాన వాటికలో గుర్తించారు. రాజు ఆత్మహత్య చేసుకున్నాడా? లేక ఎవరైనా హత్య చేసి ఉంటారా? అనే కోణంలో గీసుకొండ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొబైల్ డేటాతో పాటు సీసీ ఫుటేజ్ ల ద్వారా రాజు మృతిపై ఆరా తీస్తున్నారు. కేసు ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు గీసుకొండ సీఐ విశ్వేశ్వ‌ర‌రావు తెలిపారు.

Leave a Reply