BRS | ఉద్యమ కారుల ఓటమి..!

BRS | ఉద్యమ కారుల ఓటమి..!
BRS | మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపల్ ఎన్నికల్లో ఉద్యమకారుల కుటుంబాల నుండి పోటీ చేసిన బీఆర్ఎస్ అభ్యర్థులు ఇరువురు ఆయా వార్డుల్లో ఓటమిపాలయ్యారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఓయూ జేఏసీ నాయకులు మర్రి అనిల్ తన తల్లి మరియమ్మను 2వ వార్డులో బీఆర్ఎస్ తరఫున బరిలో దింపగా.. ఆ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి ప్రమీల గెలుపొందారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీలో ఉదయించిన కిరణమా..! అని తెలంగాణ ఉద్యమానికి ఆజ్యం పోసే పాట రచించిన ఉత్తమ సినీ గేయ రచయిత అభినయ శ్రీనివాస్ తన భార్య దొంతోజు శ్రీలతను 7 వ వార్డులో బీఆర్ఎస్ తరఫున బరిలో దింపగా.. ఆ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి శైలజ గెలుపొందారు. దీంతో తెలంగాణ ఉద్యమకారులను స్థానిక ప్రజలు ఓటమి పాలు చేయడంతో మున్సిపల్ ప్రజలు, మేధావులను విస్మయానికి గురి చేసింది.
