BRS | కాంగ్రెస్ అంటేనే మోసం : ఎమ్మెల్యే మల్లా రెడ్డి

BRS | కాంగ్రెస్ అంటేనే మోసం : ఎమ్మెల్యే మల్లా రెడ్డి

  • రెండేళ్ల లో ప్రజలు గోసపడుతున్నారు
  • జగ్గం గూడ ఉద్దెమర్రి కార్నర్ మీటింగ్ లో పాల్గొన్న మల్లా రెడ్డి
  • జోరుగా బీఆర్ఎస్ ఇంటింటా ప్రచారాలు

BRS | మూడు చింతలపల్లి, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ అంటేనే మోసపూరిత పార్టీ అని మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. బుధవారం మూడు చింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని జగ్గంగూడ సంపన్ బోల్, ఉద్దెమర్రిలో నిర్వహించిన ఇంటింటా ప్రచార కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే మల్లారెడ్డి విచ్చేసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజలు కష్టాల భారిన పడ్డారన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలోనే ప్రజలు సంతోషంగా ఉన్నారని ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు చేరాయన్నారు.

గ్రామాలు, పట్టణాల అభివృద్ధి జరిగిందంటే కేవలం బీఆర్ఎస్ పార్టీ మాజీ సీఎం కేసీఆర్ తోనే జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ప్రజలను మభ్యపెట్టి గద్దెన ఎక్కరన్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా తాగేందుకు గుక్కెడు నీరు దొరకడం లేదని వేసవి కాలం రాకముందే ఇలా ఉంటే ఇక వచ్చే వేసవిలో పరిస్థితి ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం పన్నుల కోసమే గ్రామాలను పట్టణాలుగా ఏర్పాటు చేశారని మండిపడ్డారు. మహిళలకు తులం బంగారం, విద్యార్థినులకు స్కూటీలు, వృద్దులకు రూ.4000 ఫించన్ ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి రెండేళ్లు గడుస్తున్నా.. ఇప్పటి వరకు ఊసే లేదన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం 60 ఏండ్లు పాలించి ప్రజలకు చేసిందేమీ లేదని ప్రజా సమస్యలను గాలికి వదిలేసిందన్నారు. అభివృద్ధి జరగాలంటే కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ ఎస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల ఇంచార్జి గజ్జల నాగేష్, సీనియర్ నాయకులు భద్రా రెడ్డి, పట్టణ అధ్యక్షుడు మల్లేష్ గౌడ్, మాజీ సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి అనిల్ రెడ్డి, సుధాకర్, జహంగీర్, రవీందర్ రెడ్డి, నవీన్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply