books Distribution | రాజ్యాంగాన్నిప్రతిఒక్కరు గౌరవించాలి

books Distribution | ఊట్కూర్, ఆంధ్రప్రభ : భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని పలువురు దళిత, అంబేద్కర్ సంఘం నాయకులు వార్డు సభ్యులు నరేష్ కుమార్, కొక్కు మల్లేష్, రూపా లక్ష్మణ్, మాజీ ఉపసర్పంచ్ కొండన్ గోపాల్ అన్నారు. శనివారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని శ్రీరామ్ నగర్ వెదుకు చెందిన కవిత రాణి రాజప్ప దంపతుల కుమారుడు సాయి చేతన్ జన్మదినం పురస్కరించుకొని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో కార్యాలయాల్లో రాజ్యాంగం పుస్తకాలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రభుత్వ ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందాలనే సంకల్పంతో రాజ్యాంగాన్ని రచించారని అన్నారు. భారత రాజ్యాంగం పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని లక్ష్యంతో భారత రాజ్యాంగం పుస్తకాలు పంపిణీ చేస్తున్నామని అన్నారు.
విద్యార్థులు విద్యార్థి దశ నుండి భారత రాజ్యాంగం పట్ల అవగాహన కలిగి ఉండడంతో ఉజ్వల భవిష్యత్తు ఉందన్నారు. జెండా ఆవిష్కరణ వేడుకల్లో పాఠశాలల విద్యార్థులు అంబేద్కర్ వేషధారణలో రాజ్యాంగం పుస్తకం ఉండాలని పంపిణీ చేస్తున్నామని అన్నారు. బడుగు బలహీన వర్గాలు దళిత మైనార్టీల కోసం రాజ్యాంగంలో అంబేద్కర్ రచించిన ఫలాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
భారత రాజ్యాంగం పుస్తకం పంపిణీ చేయడంతో పలువురు కవితా రాణి రాజప్ప దంపతులను సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ అంబేద్కర్ సంఘ అధ్యక్షులు ఆర్. హన్మంతు, నాయకులు చందు, తరుణ్, శంకర్, మోహన్, అనిల్, వివేక్, కౌశిక్ తదితరులు పాల్గొన్నారు.
