Pakistan | వజీరిస్థాన్‌లో పేలిన బాంబు.. ఏడుగురు మృతి

సౌత్ వజీరిస్థాన్ : పాకిస్థాన్‌లో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు మరణించగా మరికొంత మందికి గాయాలయ్యాయి. సౌత్ వజీరిస్థాన్‌లోని ఓ పీఎస్ కమిటీ భవనంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పేలుడుకు ఎవరు కారణమ‌నేది ఇంకా నిర్దారించలేదని పోలీసులు చెబుతున్నారు.

ఘటననపై దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ఇండియా పాక్ ఉధ్రిక్తతల సమయంలో పాకిస్థాన్‌లో పేలుడు ఆసక్తికరంగా మారింది. పహల్గామ్ దాడి నేపథ్యంలో ఇండియా పాక్ పై సీరియస్‌గా ఉన్న సంగతి తెలిసిందే. సరిహద్దు ప్రాంతాల్లో యుద్ద మేఘాలు కమ్ముకున్నాయి. బార్డర్ వద్ద పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడితే భారత సైన్యం తిప్పికొడుతోంది. మరోవైపు కేంద్రంలోని పెద్దలు, రక్షణశాఖ మంత్రి తరచూ సమావేశం అవుతున్నారు. దీంతో భయం గుప్పిట్లో ఉన్న పాకిస్థాన్‌లో పేలుడు సంభవించడం ఆ దేశానికి వణుకు పుట్టిస్తోంది.

Leave a Reply