ఘనంగా శ్రీకారం

జైనూర్, అక్టోబర్ 16 (ఆంధ్రప్రభ) : కొమరం భీమ్ ఆసిఫాబాద్ (Komaram Bheem Asifabad) జిల్లా జైనూర్ మండలంలోని ఆదివాసీ గూడాల్లో బోగీ పండుగ వేడుకలకు ఘనంగా శ్రీకారం చుట్టారు. ప్రతి ఏటా దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని జరుపుకునే దీపావళి పండగను ఆదివాసీ గుడాల్లో బోగీ పండుగ తో వేడుకలను ప్రారంభించడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా గురువారం మండలం లోని లెండిజాల, జైనూర్, పట్నాపూర్, గుడమామడ, జెండగూడ, పారా, రాసిమెట్ట, భూసిమెట్ట, మర్లవాయి గ్రామాల్లో ఆదివాసీలు బోగీ వేడుకలు నిర్వహించారు.

దండారి ఉత్సవాల (Dandari Festival) కు వాయించే సాంప్రదాయ వాయిద్యలైన పర, వెట్టి, గుమ్మెల, కొహుడల్, నెమలి పించలతో తయారు చేసిన గుస్సా డీ టోపీలకు మహిళలు, పురుషులు వయోభేదం లేకుండా ప్రత్యేక పూజలు చేశారు. నవధాన్యాలతో తయారు చేసిన పిండి వంటకాలను తయారు చేసి నైవేద్యం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ తిరుమల విశ్వనాథ్, పాక్స్ చైర్మన్ హన్నుపటెల్, లెండిజాల సార్మే డీ మెస్రం బాది రావు, మార్లవాయి సార్మెడీ దేవ రావు, మెస్రం అంబాజీ, మెస్రం భీమ్ రావు, మెస్రం పాలకరావు, తనాజీ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply