ఆశీర్వదించండి అభివృద్ధి చేసి చూపిస్తా

క్యాతన్ పల్లి, ఆంధ్రప్రభ ; ఎన్నికలలో బాగంగా బిఆర్ఎస్, సిపిఐ కూటమి తరుపున 17వ,వార్డులో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జిఎస్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు గుడిసెల సంధ్యారాణి రాజారమేష్ లు శనివారం వార్డులో విస్తృత ప్రచారాన్నీ నిర్వహించారు. ఈ సందర్భంగా అభ్యర్థి మాట్లాడుతూ వార్డు ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉంటామని, ఏ సమస్య వచ్చినా, మీ కొరకు ముందు ఉంటానని అన్నారు. ప్రత్యేక నిధులతో వార్డును అభివృద్ధి చేయడమే, నా లక్ష్యం, వార్డు అభివృద్ధికి పాటుపడతానని అన్నారు. గతంలో ఎలాంటి పదవి లేని సమయంలోనే జిఎస్ఆర్ ఫౌండేషన్ స్థాపించి ప్రజలకు ఎన్నో సమస్యలు చేశామని, అభివృద్ధి కొరకై వార్డు ప్రజలు బారి మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యురాలు రామిడికుమార్ ఉమాదేవి,పార్టీ సీనియర్ నాయకులు రామిడి కుమార్,యువ నాయకుడు లక్ష్మీ కాంత్,బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు, సిపిఐ నాయకులు,వార్డు ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply