బీజేపీకి క్రమేపీ పెరుగుతున్న ఆదరణ..

ఆలేరు, ఆంధ్రప్రభ : బీజేపీ పట్ల తెలంగాణ రాష్ట్రంలో క్రమంగా ఆదరణ పెరుగుతున్నదని ఇది భవిష్యత్తు మంచి సూచన అని ఆ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు ప్రాంత యువజన విభాగం నాయకులు మంగళపల్లి ఎల్లేష్ శుక్రవారం చెప్పారు. ఇటీవల జరిగిన సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలలో బిజెపి ఎక్కువ మొత్తంలో సర్పంచులు, కౌన్సిలర్ స్థానాలను గెలుచుకున్నదని ఆయన గుర్తు చేశారు. ఆలేరు మున్సిపల్ పరిధిలోని 8 వ వాటిలో బిజెపి అభ్యర్థి బొట్ల సంపత్ కౌన్సిలర్ గా ఎన్నికైనందుకు ఆయన హర్షం వ్యక్తం చేశారు. కార్యకర్తలు, నాయకుల సమన్వయంతో ఆలేరు మున్సిపల్ పరిధిలో రెండు కౌన్సిలర్ స్థానాలను బిజెపి గెలుచుకొని తన ప్రాధాన్యతను చాటిందని ఆయన తెలిపారు.

Leave a Reply