BJP | ఆ.. నిధులతోనే అభివృద్ది చేద్దాం..

BJP | ఆ.. నిధులతోనే అభివృద్ది చేద్దాం..
BJP, ఊట్కూర్, ఆంధ్రప్రభ : ఎంపీ డీకే అరుణ నిధులతో గ్రామాలనను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుందామని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి, బీజేపీ మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.భాస్కర్ అన్నారు. బుధవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని అవుసలోనిపల్లి, లక్ష్మీపల్లి, మల్లేపల్లి గ్రామాల్లో ఎంపీ నిధులతో ఏర్పాటు చేసిన ఐమాక్స్ లైట్లు ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మక్తల్ నియోజకవర్గంలో బీజేపీ నుంచి నూతనంగా గెలుపొందిన సర్పంచులకు ఎంపీ నిధుల నుంచి రూ.10 నుండి 20 లక్షల రూపాయల గ్రామాల అభివృద్ధి కొరకు తమ వంతుగా మంజూరు చేయించడానికి ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. ప్రతి కార్యకర్తకు ఎల్లప్పుడూ అండగా ఉంటాను అన్నారు. ఎంపీ డీకే అరుణ సహకారంతో మరిన్ని నిధులు తీసుకువచ్చి గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు. నూతనంగా గెలుపొందిన సర్పంచులు, ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి సేవ చేయాలని అన్నారు.
ప్రజాసేవ చేసేందుకు ముందుండి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. అనంతరం బీజేపీ నాయకులను పలువురు నాయకులు, కార్యకర్తలు, ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లు ఎల్లమ్మ, రేణుక, లక్ష్మీపల్లి మాజీ సర్పంచ్ భాస్కర్, బీజేపీ సీనియర్ నాయకులు వెంకటయ్య, బీజేపీ నాయకులు రమేష్, సంజీవ్, నాగరాజు, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
