1వ వార్డులో బిజెపి అభ్యర్థి రాజశేఖర్ రెడ్డి గెలుపు

మక్తల్ , ఆంధ్రప్రభ ; నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో 1వ వార్డులో కాంగ్రెస్ బిజెపి పార్టీల నుండి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులుగా బరిలో నిలవడంతో ఇక్కడ హోరావూరిగా పోరు సాగింది. నువ్వా నేనా అన్నట్లు సాగిన పోరులో చివరకు బిజెపి అభ్యర్థి బి.రాజశేఖర్ రెడ్డి విజయం సాధించారు. ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిగా పోటీచేసిన బి .రాజశేఖర్ రెడ్డి కి 388 ఓట్లు లభించగా కాంగ్రెస్ అభ్యర్థి కట్ట సురేష్ కుమార్ గుప్తకు 330 ఓట్లు లభించాయి .బిఆర్ఎస్ అభ్యర్థి 24 ఓట్లు ఇతరులకు నాలుగు ఓట్లు నోటాకు నాలుగు ఓట్లు చెల్లనివి రెండు ఓట్లుగా నమోదయ్యాయి .దీంతో కాంగ్రెస్ అభ్యర్థి కట్ట సురేష్ కుమార్ గుప్తాకు పై బిజెపి అభ్యర్థి బి.రాజశేఖర్ రెడ్డి 58 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారని ఎన్నికల అధికారులు ప్రకటించారు. దీంతో బిజెపి శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు.

Leave a Reply