1వ వార్డులో బిజెపి అభ్యర్థి ప్రచారం

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలోని 1 వ వార్డులో బిజెపి అభ్యర్థి కామిటికారి జ్యోతి కృష్ణ శనివారం ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఓటర్లను కలిసి తనకు మద్దతు ఇవ్వాలని ఆమె కోరారు. సీనియర్ నాయకులు పంపరి లక్ష్మీనారాయణ,జిల్లా బిజెపి కార్యదర్శి కామిటికారి కృష్ణ, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply