సమయపాలన పాటించేందుకే బయోమెట్రిక్ విధానం

మధిర, ఆంధ్రప్రభ ; బయోమెట్రిక్ విధానంతో ఉద్యోగుల వాస్తవమైన హాజరు శాతాన్ని నమోదు చేయవచ్చని మధిర మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని సుజాత స్పష్టం చేశారు.మంగళవారం ఉదయం పారిశుద్ధ కార్మికుల బయోమెట్రిక్ విధానాన్ని మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని సుజాత పరిశీలించి పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడారు.

మధిర మున్సిపాలిటీలలో పారిశుధ్య, ఇతర సిబ్బంది హాజరును పకడ్బందీగా నమోదు చేసేందుకు, సమయపాలన పాటించేందుకు బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేయటం జరిగిందన్నారు. బయోమెట్రిక్ హాజరు విధానంలో ఉదయం, సాయంత్రం రెండు పూటలా పారిశుద్ధ కార్మికుల వేలిముద్రల ద్వారా హాజరును రికార్డు చేస్తుందన్నారు.పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకే పారిశుధ్య కార్మికులు,అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు.

Leave a Reply