Bigg Boss 9 | ఆ ఇద్దరు తప్ప!

Bigg Boss 9 | ఆ ఇద్దరు తప్ప!

Bigg Boss 9 | నామినేషన్స్ లో ఆ ఆరుగురు


Bigg Boss 9 | బిగ్‌బాస్ -9 ఫినాలే మ‌రో రెండు వారాల చేరువ‌లో ఉంది. బిగ్‌బాస్ కుటుంబ స‌భ్యుల్లో టెన్ష‌న్ మొద‌లైంది. అలాగే ప్రేక్ష‌కుల్లో కూడా ఉత్కంఠ నెల‌కొంది. ఇక తాజాగా నిన్ని 13వ వారం నామినేష‌న్స్ (Nomination) ప్ర‌క్రియ పూర్త‌యింది. ఈ ప్ర‌క్రియ‌లో ఇద్ద‌రు త‌ప్ప మిగిలిన ఆరుగురు నామినేష‌న్స్‌లో ఉన్నారు. కెప్టెన్ అయిన‌ కళ్యాణ్‌కి ఎలాగో ఇమ్యూనిటీ ఉంది. అలాగే స్ట్రాంగ్‌గా ఉన్న ఇమ్మాన్యుయేల్ ఈ వారం నామినేట్ కాలేదు. ఈ వారం త‌నూజ‌, ప‌వ‌న్‌, భ‌ర‌ణి, రీతూ, సుమ‌న్ శెట్టి, సంజ‌నా నామినేష‌న్‌లో ఉన్నారు. కుటుంబ స‌భ్యుల నుంచి కాకుండా భ‌ర‌ణి నేరుగా కెప్టెన్ క‌ళ్యాణ్ నామినేట్ చేశారు.

Bigg Boss 9 ఈ వారం ఇమ్మాన్యుయేల్ సేఫ్‌!


ఇమ్మాన్యుయేల్ సేఫ్ గేమ్ ఆడుతున్న‌ట్లు ఎవ‌రూ గ‌మ‌నించ‌లేరు. దాదాపు కుటుంబ స‌భ్యులంద‌రితోనూ మంచి స‌త్సంబంధాలు ఏర్ప‌ర్చుకున్నాడు. ప్ర‌ధానంగా సంజ‌నా అయితే కొడుకుగా పిలుస్తుంది. ఇమ్మాన్యుయేల్‌కు (Emmanuel) తాను నామినేట్ చేయ‌లేన‌ని గ‌త వారం కూడా సంజ‌నా చెప్పింది. అలాగే త‌నూజ‌తో ఉన్న స్నేహ‌బంధం కూడా ఇమ్మాన్యుయేల్ నామినేట్ నుంచి త‌ప్పించుకున్నారు ఈ వారం. అలాగే ప‌వ‌న్ కూడా మొద‌ట ఇమ్మాన్యుయేల్ పేరు చెబుతూ పాయింట్‌లు లేన‌ప్ప‌టికీ నిన్ను నామినేట్‌లోకి తీసుకు రావాల‌ని అనేట‌ప్పుడు కుటుంబ స‌భ్యులంతా న‌వ్వులు కురిపించ‌డంతో ఆ నామినేష‌న్ ప్ర‌క్రియ నిలిపి వేసి సంజ‌నాకు నామినేట్ చేశారు. ఇలా ఇద్ద‌రు కూడా ఇమ్మాన్యుయేల్ పై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు త‌ప్ప నామినేట్ చేయ‌లేదు. ఇక కెప్టెన్ క‌ళ్యాణ్ కు అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడు పాయింట్లు లేన‌ప్ప‌టికీ భ‌ర‌ణికి నామినేట్ చేశాడు. మొత్తం మీద ఈ వారం ఇమ్మాన్యుయేల్ సేఫ్ అయ్యాడు.

Bigg Boss 9

Bigg Boss 9 అస‌లు క‌థ ఇక్క‌డే ప్రారంభం!


ఈ వారం ప్ర‌తి ఒక్క ఇంటి స‌భ్యుడికే ప్ర‌తిష్ఠాత్మ‌క‌మే. బిగ్‌బాస్ (Bigg Boss) ఎప్పుడు ఎలాంటి ట్విస్ట్ ఇస్తారో ఎవ‌రికి అంతు ప‌ట్ట‌డం లేదు. రెండు వారాల్లో ముగ్గురిని ఎలిమినేట్ చేయాలి. అయితే ఈ వారం ఇద్ద‌రు ఎలిమినేట్ అవుతారో, వ‌చ్చే వారం ఇద్ద‌రు ఎలిమినేట్ (Eliminate) అవుతారో అనేది వ‌చ్చే ఆదివారం తేలుతుంది. గ‌తంలో స్ట్రాంగ్ గా ఉన్న రీతూ, భ‌ర‌ణి, సుమ‌న్ శెట్టి, ప‌వ‌న్‌, సంజ‌నా ఆట‌ల్లో వెనుక‌బ‌డి ఉన్నారు. అయితే వీళ్ల‌లో టాప్ ఫైవ్‌కు ఎవ‌రెవ‌రు వెళ‌తారు అనేది వేచి చూడాలి. ఈ సారి కెప్టెన్సీ టాస్క్ ఉండ‌క‌పోవ‌చ్చు. అయితే ఇమ్యూనిటీ కోసం గేమ్స్ పెట్టే అవ‌కాశం ఉంటుంది. ఈ సారి ఒక గ్రూపు గేమ్ ఉన్న‌ప్ప‌టికీ వ్య‌క్తిగ‌త గేమ్స్ ఎక్కువ‌గా ఉండ వ‌చ్చున‌ని ప‌లువురు భావిస్తున్నారు.

Bigg Boss 9

click here to read more

click here to read Bigg Boss 9| అస‌లు ర‌ణ‌రంగం ఈ వార‌మే!

Leave a Reply