ఉపాధ్యాయ నియామక ప్రక్రియ తుది దశలోకి చేరుకుంది. జిల్లాల వారీగా ఇప్పటికే మెరిట్ జాబితాలు విడుదల కాగా, అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం సిద్ధమయ్యారు. అయితే రేపు (ఆగస్టు 25) జరగాల్సిన మెగా DSC-2025 సర్టిఫికేట్ వెరిఫికేషన్ వాయిదా పడిందని అధికారులు ప్రకటించారు.
ఈ మేరకు అనంతపురం, నెల్లూరు, కాకినాడ జిల్లాల విద్యాశాఖ అధికారులు అధికారిక ప్రకటన విడుదల చేశారు. రేపు అభ్యర్థులు వెరిఫికేషన్ కోసం హాజరుకావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కొత్త షెడ్యూల్‌ను రాష్ట్ర కార్యాలయం త్వరలో SMS ద్వారా తెలియజేస్తారని తెలిపారు. అలాగే, అభ్యర్థులు అధికారిక SMS అప్‌డేట్స్ కోసం వేచి చూడాలని సూచించారు.
కాల్ లెటర్ల వివరాలు
అభ్యర్థులకు కాల్ లెటర్లు 1:1 నిష్పత్తిలో జారీ అవుతున్నాయి. అభ్యర్థులు తమ వ్యక్తిగత లాగిన్ ద్వారా https://apdsc.apcfss.in/ వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలి.
తీసుకెళ్లవలసిన పత్రాలు:
అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు
తాజా కుల ధ్రువీకరణ పత్రం
గెజిటెడ్ అధికారి ధ్రువీకరించిన మూడు సెట్ల జిరాక్స్ కాపీలు
ఐదు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు
ముఖ్య సూచనలు
వెరిఫికేషన్‌కు ముందు తప్పనిసరిగా పత్రాలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలి. కేటాయించిన సమయం, తేదీకే హాజరుకావాలి. సమయానికి రాని అభ్యర్థుల స్థానంలో మెరిట్ జాబితాలోని తర్వాతి అభ్యర్థులకు అవకాశం లభిస్తుంది.
తదుపరి చర్యలు
సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయిన వెంటనే కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ మొదటి వారం లోపు కౌన్సెలింగ్ పూర్తి చేసే అవకాశం ఉంది. ప్రక్రియకు సంబంధించిన అన్ని అప్‌డేట్స్ కోసం అధికారిక వెబ్‌సైట్‌ను ఎప్పటికప్పుడు సందర్శించమని అధికారులు సూచించారు.