Bichkunda | ఇందిరమ్మ ఇండ్లు మంజూరుకు కృషి..

Bichkunda | బిచ్కుంద, (కామారెడ్డి) ఆంధ్రప్రభ : ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కృషి చేస్తున్నామని పుల్కల్ సర్పంచ్ సంతోష్ పటేల్ అన్నారు. వసంత పంచమి సందర్భంగా పుల్కల్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు నేతృతంలో గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అవుతున్నాయని, లబ్ధిదారులు ముందుకు వచ్చి తొందరగా పూర్తి చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పద్మా తుకారం, వీరమని గోపాల్ రెడ్డి, గ్రామ పెద్దలు మాజీ సర్పంచ్ భూమిశెట్టి, గర్దాస్ సాయిలు, శేఖర్, తుకారం, నాయకులు శ్యాం పటేల్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply