బీఆర్ఎస్ లో చేరికలు

భీంగల్ టౌన్, ఆంధ్రప్రభ : భీంగల్ పట్టణానికి చెందిన బీజేపీ నాయకులు ఇదాపు ప్రణయ్ గురువారం బీఆర్ఎస్ లో చేరారు. అతనికి మాజీ మంత్రి, బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్బంగా బీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యం అవుతుందని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమం లో మాజీ జడ్పీటీసీ చౌట్పల్లి రవి తదితరులు ఉన్నారు.
