హైదరాబాద్ : బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో యాంకర్ విష్ణుప్రియ సహా పలువురు టాలీవుడ్ సెలబ్రిటీల పేర్లు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రముఖ నటులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లతో సహా మొత్తం 25మందిపై మియాపూర్‌కి చెందిన సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.
దీంతో ఈ కేసు విచారణలో భాగంగా ఇప్పటికే పంజాగుట్ట పోలీసులకు తన వాంగ్మూలం ఇచ్చిన విష్ణుప్రియ.. తాజాగా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసుపై క్వాష్ పిటిషన్ దాఖలు చేసింది విష్ణుప్రియ. బెట్టింగ్ యాప్స్ కేసులో తనపై నమోదైన రెండు ఎఫ్ఐఆర్‌లను క్వాష్ చేయాలంటూ యాంకర్ విష్ణుప్రియ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై హైకోర్టు మంగళవారం విచారణ జరపనున్నట్లు సమాచారం.