Bellampally | రైల్వే కార్మికుల సమస్యలు పరిష్కరించాలని…

Bellampally | రైల్వే కార్మికుల సమస్యలు పరిష్కరించాలని…
డీ ఆర్ ఎం కు రైల్వే మద్దూర్ యూనియన్ వినతి
Bellampally | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి రైల్వే స్టేషన్లో రైల్వే కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని దక్షిణ మధ్య రైల్వే మద్దూర్ యూనియన్ బెల్లంపల్లి బ్రాంచ్ చైర్మన్ ఎస్ నాగరాజు, సెక్రటరీ జీ సంబాశివునితో కలిసి సికింద్రాబాద్ రైల్వే డివిజనల్ మేనేజర్ డాక్టర్ గోపాలకృష్ణన్ నుకోరారు. ఈ రోజు బెల్లంపల్లి రైల్వే స్టేషన్ నిర్వహించిన రైల్వే డిపార్ట్ మెట్ల రక్షణ వారోత్సవాలసమీక్షలో డీ ఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఆర్ఎంను కలిసిన నాగరాజు సాంబశివుడులు రైల్వే కాలనీ లో నెలకొన్న సమస్యల పై డీఆర్ ఎంకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బెల్లంపల్లి రైల్వేకాలనీలో క్రికెట్ గ్రౌండ్ ను అభివృద్ధి పరచాలని, తగు సౌకర్యాలు కల్పించాలని, బెల్లంపల్లి, మంచిర్యాల రైల్వే కాలనీ లకు మిషన్ భగీరథ నీరు సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని, రైల్వే ఆసుపత్రిని అన్ని విధాల అభివృద్ధి పరచాలని వారు కోరారు.
అంతే కాకుండా బెల్లంపల్లి రైల్వే ఆస్పిటల్ లో అంబులెన్స్ ను ఏర్పాటు చేసి డ్రైవర్ను నియమించాలని,వారు కోరారు. బెల్లంపల్లి మంచిర్యాలలో కార్మికులకు సరిపడ కొత్త రైల్వే క్వార్టర్స్ ని నిర్మించాలని డీఆర్ ఎంను కోరారు. ఇందుకు స్పందించిన రైల్వే డివిజనల్ మేనేజర్ గోపాలకృష్ణన్ సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తానని మజ్దూర్ యూనియన్ నాయకులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సౌత్ సెంట్రల్ రైల్వే మద్దూర్ యూనియన్ బెల్లంపల్లి బ్రాంచి ట్రెజరర్ షోకేష్ మీనా, నాయకులు వివేక్ కుమార్, రమేష్, గోపరాజు, నీరజ, అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.
