Be alert | భారీ వర్షం తప్పదు

Be alert | భారీ వర్షం తప్పదు

  • కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో : బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాన్ పట్ల ఏపీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కోరారు. ఆదివారం రోజు న తుఫాన్ తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా తీరాలను తాకే అవకాశం ఉన్నప్పటికీ..సోమవారం (డిసెంబర్ 1 ) నుండి భారీగా వర్షం కురిసే అవకాశం ఉందని కేంద్ర మంత్రి తెలిపారు.

ప్రధానంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని, స్థానిక వ్యవసాయ అధికారులు, రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకుని తమ పంటలను కాపాడుకోవాలని కోరారు. పంట కోతల విషయంలో వ్యవసాయ అధికారులు సూచనలు తీసుకుని ముందుకు వెళ్తే తక్కువ నష్టం జరిగే అవకాశం ఉందని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాకు ప్రస్తుతానికి వాతావరణ శాఖ నుండి రెడ్, ఆరెంజ్ అలర్ట్ లు లేకపోయినప్పటికీ వర్ష సూచనలు స్పష్టంగా ఉన్నాయని, వాతావరణ మార్పులు దృష్టిలో ఉంచుకుని రైతులు అప్రమత్తంగా ఉండాలని రామ్మోహన్ నాయుడు కోరారు. జిల్లా అధికారులు.. రైతులకు అందుబాటులో ఉండాలని అదేశించారు.

Leave a Reply