Bapatla | మనసులోని చీకటిని దహనం చేద్దాం..

Bapatla | మనసులోని చీకటిని దహనం చేద్దాం..

  • మనిషిలోని మంచితనాన్ని వెలిగిద్దాం
  • బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు

Bapatla | బాపట్ల టౌన్, ఆంధ్రప్రభ : మనందరం ఆచరించే గొప్ప సాంస్కృతికి నిదర్శనం ఈ భోగి మంటలు. ఇవి కేవలం ఎందుకట్టల కలయిక కాదు మనలోని అహాన్ని అసూయ, స్వార్థాన్ని దహనం చేసి ఒక స్వచ్ఛమైన మనిషిగా పునర్జీవం పొందే వేడుక అని బాపట్ల నియోజకవర్గ శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ రాజు పేర్కొన్నారు. బుధవారం భోగి పండగను పురస్కరించుకొని శ్రీ సుందరవల్లి రాజ్యలక్ష్మి సమేత శ్రీ క్షీర భావనారాయణ స్వామి దేవాలయం వద్ద భోగిమంట వెలిగించి ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో సిరిసంపదలతో తులతూగుతూ ఉండాలని స్థానిక శాసనసభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంత‌రం నియోజకవర్గ ప్రజలకు భోగి శుభాకాంక్షలు తెలియజేశారు.

Bapatla

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మనిషి మరో మనిషికి మేలు చేసే మంచి మనసును కలిగి ఉన్నప్పుడే సమాజం సుభిక్షంగా ఉంటుందన్నారు. మన నేల తల్లి పాడిపంటలతో సిరిసంపదలతో తులతూగాలని జలదారులు జీవ నదులై ప్రతి ప్రాణి దాహాన్ని తీర్చాలని ఆ భగవంతుడిని ప్రార్ధించినట్లు తెలిపారు. వ్యక్తిగత స్వార్థం కంటే లోక కల్యాణం మిన్న అని చాటి చెబుతామన్నారు. ఈ భోగి వెలుగులో మీ జీవితాలలోని కష్టాలను తొలగించి ఆనందాలను నింపాలని ఆకాంక్షించారు. మంచిని పంచుదాం మానవత్వాన్ని కాపాడుకుందాం అని పిలుపునిచ్చారు.

Leave a Reply