చెత్త సేకరణ, తడి పొడి చెత్తపై అవగాహన

జుక్కల్ (కామారెడ్డి), ఆంధ్రప్రభ : 99 రోజుల ప్రజాపాలన-ప్రగతిప్రణాళికలో భాగంగా జుక్కల్ మండల కేంద్రంలో వివిధ గల్లీలో తడి చెత్త,పొడి చెత్తను సేకరించడం జరిగింది. దీంతో పాటు జుక్కల్ గ్రామ కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ ప్రజలకు,ముఖ్యంగా మహిళలకు అవగాహన కల్పిస్తూ తడిచెత్త,పొడిచెత్తను వేరు వేరు చేసి గ్రామపంచాయతీ వాహనల్లో పంచాయతీ సిబ్బంది ద్వారా తరలించాలన్నారు.అనంతరం సగ్రిగేషన్ షెడ్డును పరిశీలించారు. జుక్కల్ ను చెత్తరహిత పట్టణంగా తీర్చిదిద్దడం జరుగుతుందని, పచ్చదనం, పారిశుభ్రతపై దృష్టి సారించటం జరుగుతుందని, గ్రామస్తులు కూడా తమవంతు సహకారం అందించాలని కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
