Awareness | ప్రలోభాలకు గురికావద్దు

Awareness | నర్సింహులపేట, ఆంధ్రప్రభ : ఓటర్లు ప్రలోభాలకు గురికావద్దని దంతాలపల్లి మండల కేంద్రంలో ఉన్న అక్షర హైస్కూలు విద్యార్థులు నర్సింహులపేట మండలం పెద్దనాగారం గ్రామంలో ఓటు హక్కు(right to vote)పై ప్రజలకు శుక్రవారం అవగాహన కల్పించారు. ఎన్నికల్లో నాయకులు ఇచ్చే డబ్బుకు ఆశపడి ఓటును అమ్ముకోకుండా నిజాయితీ, నిబద్ధత కలిగిన నాయకున్ని ఎన్నుకుంటే భవిష్యత్తు(the future) తరాలకు బంగారు బాట అవుతుందని అవగాహన కల్పించారు.

Leave a Reply