
Avanigadda | తక్షణ చర్యలు తీసుకోవాలి..
Avanigadda | తక్షణ చర్యలు తీసుకోవాలి..
దోవా గోవర్ధన్ డిమాండ్..
Avanigadda | అవనిగడ్డ, ఆంధ్రప్రభ : కృష్ణా జిల్లా నాగాయలంక మండలం ఈలచెట్లదిబ్బలో యానాదులపై జరుగుతున్న నిర్బంధ అరాచకాన్ని కట్టడి చేయాలని లేనిపక్షంలో వారి తరఫున న్యాయపోరాటానికి కృష్ణాజిల్లా మాల మహానాడు కార్యాచరణ రూపొందిస్తుందని దోవా గోవర్ధన్ అన్నారు. ఎస్సీ ఎస్టీల శ్రమ దోపిడి అత్యాచారం వంటి విషయాల్లో దోషులపై వెంటనే ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని, బాధితులకు ప్రభుత్వ పరంగా రక్షణ చర్యలు చేపట్టి, ఆర్థిక భరోసా వసతి సౌకర్యం కల్పించాలి అని కోరారు. గత రెండు రోజులుగా ఈల చెట్లదిబ్బ ఏనాదులు సోషల్ మీడియా ద్వారా తెలియజేసిన విషయాలు తమ దృష్టికి వచ్చాయని ఈ విషయంపై సదరు ప్రభుత్వ అధికారులు పోలీస్ యంత్రాంగం ముద్దాయిలపై కఠిన చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేసారు. ఈ వ్యవహారంలో ముద్దాయిలు తరఫున ఎటువంటి రాజకీయాలు చేసిన వారు ఎంతటి వారైనా ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టానికి గురికావాల్సి వస్తుందని అన్నారు. ఒకటి రెండు రోజుల్లో పలు ప్రజా సంఘాల నేతలతో కలిసి ఈల చెట్ల దిబ్బ బాధితులను కలిసి తగిన విధంగా ముందు వెళతామని తెలిపారు.
