Auto Stunt | ఆటో రీల్ వాలా

Auto Stunt | ఆటో రీల్ వాలా
- కర్నూలులో నడిరోడ్డులో స్టంట్ల గోల
- పోలీసుల అదుపులో నలుగురు జనంలో భయాందోళన
( కర్నూలు, ఆంధ్రప్రభ బ్యూరో)
తరాలు మారాయి. కాలవేగం చిన్నబోతోంది. ప్రతీ క్షణం ఆశ్చర్యం ఆకాశం హద్దులు దాటుతోంది. సోషల్ మీడియాలో (Social Media).. అపసృతులకే రీల్స్ (Reels) పెద్ద పీట వేస్తున్నాయి. ఈజీ మనీ (Easy Money) కోసం యువత ప్రాణాలను పణంగా పెడుతోంది. ఇప్పటి వరకూ ఔటర్ రింగు రోడ్డుల్లో బైకుల రేస్ (Bike Races) లు చూశాం. ప్రాణాలు పోగొట్టుకున్న హీరోల కథలు విన్నాం. కన్నీళ్లను తుడిచి అమ్మానాన్నలను ఓదార్చలేక పోతున్నాం. ఎందుకంటే.. మితిమీరిన విన్యాశాలను జనం ఒప్పుకోరు. సహించరు. ఇక కర్నూలులో రౌడీ బాయ్ లు తెరమీదకు వచ్చారు. జాతీయ రహదారి లేదు. ఖాళీ రోడ్డు కనిపిస్తే చాలు.. ఆటో స్టంట్ (Auto Stunts) లకు ఎగబడుగున్నారు.
Auto Stunt యాక్సిడెంట్లా.. భయం లేదు

డ్డుప్రమాదాలు ఒక్కోసారి అకాలంలో, ఎటువంటి సూచనా లేకుండా చోటుచేసుకుంటాయి. దురదృష్టవశాత్తూ అవి ఎవరి చేతైనా అడ్డుకోవడం సాధ్యపడదు. అయితే, అనేక ప్రమాదాల్లో ప్రాణనష్టం వెనుక ముఖ్య కారణం వాహనదారుల బాధ్యతారాహిత్యమే అన్నది వాస్తవం. ట్రాఫిక్ నిబంధనలు, వేగ పరిమితులు, రోడ్డు పరిస్థితులు… వీటన్నింటినీ పట్టించుకోకుండా వాహనాలు నడపడం వల్ల ఎన్నో కుటుంబాలు శాశ్వత దుఃఖంలో మునిగిపోతున్నాయి.
Auto Stunt : ఫ్యామిలీ ఊసే లేదు
వీధిలోకి బయలుదేరే ప్రతి డ్రైవర్… ఇంట్లో తన కోసం ఎదురు చూస్తున్న అమ్మానాన్నలు, భార్యాభర్తలు, పిల్లలు (Family) వారి బాధ్యతల్ని మనసులో పెట్టుకుంటే నిర్లక్ష్యం ప్రదర్శించే అవకాశం లేదు. కానీ కొందరికి వేగమంటే మత్తు, స్టంట్ (Dunk and Drive) అంటే వినోదం. ఇలాంటి అలవాట్లతో తమ ప్రాణాలే కాదు, నిరపరాధుల ప్రాణాలనూ ప్రమాదంలో (Accidents) పడేస్తున్నారు.
Auto Stunt : ఇక ఆటో స్టంట్ల కలకలం
ఇలాంటి వ్యవహారమే ఇటీవల కర్నూలు నగరంలో (Kurnool City) వెలుగులోకి వచ్చింది. నగర శివారు ప్రాంతాల్లో కొందరు ఆటో డ్రైవర్లు ఉరుకుల పరుగుల వేగంతో స్టంట్లు (Stunts) చేస్తూ రోడ్లపై విర్రవీగుతున్నారన్న సమాచారం ట్రాఫిక్ పోలీసులకు చేరింది. నిరంతరం వేగం High Seed) పెంచుతూ, ఒకదాని వెనక ఒకటి మలుపులు తీస్తూ, ఆటోలను రేసు వాహనాల్లా నడపడం స్థానికుల్లో భయాందోళనలు రేపింది.ప్రమాదం ఎప్పుడో అనే అనుమానాలతో రోడ్డు ప్రయాణికులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఈ ఆటో రేసుల వీడియోలు సోషల్ మీడియాలో కూడా చక్కర్లు కొడుతూ ప్రజల్లో ఆగ్రహానికి దారితీశాయి.
Auto Stunt : పోలీసుల అదుపులో నలుగురు

వెంటనే స్పందించిన ట్రాఫిక్ పోలీసులు (Traffic Police) సంబంధిత ప్రాంతాల్లో పర్యవేక్షణ పెంచి, చివరకు నలుగురు ఆటో డ్రైవర్లను (Four Auto Drivers) అదుపులోకి తీసుకున్నారు. వారి ఆటోలు స్వాధీనం చేసుకుని, ట్రాఫిక్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా డ్రైవర్లకు (Police Couneling) పోలీసులు కౌన్పెలింగ్ నిర్వహించారు.
Auto Stunt : మళ్లీ చేస్తే కఠిన చర్యలే
కౌన్సెలింగ్‌లో డ్రైవర్లకు ట్రాఫిక్ నియమాలు, వేగం కారణంగా జరిగే ప్రమాదాలు, అట్టి ప్రమాదాల్లో ప్రాణనష్టం ఎలా జరుగుతుందన్న దానిపై అధికారులు వివరించారు. డ్రైవింగ్ అనేది బాధ్యత, ఒకరి తప్పిదం మరొకరి ప్రాణాన్ని బలి తీసుకోవచ్చన్న విషయం వారిని అవగాహనలోకి తీసుకువచ్చారు. అదే సమయంలో మళ్లీ ఇలాంటి స్టంట్లు, వేగప్రదర్శనలు చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు స్పష్టం చేశారు. అవసరమైతే వాహనాల పర్మనెంటు రద్దు… డ్రైవర్ల లైసెన్సుల సస్పెన్షన్… చట్టపరమైన కేసులు నమోదు చేయడానికూ వెనుకాడబోమని హెచ్చరించారు.
Auto Stunt : ప్లీజ్ వదలొద్దు.. జనం గగ్గోలు
ఈ ఘటనతో నగరవాసులు మరోసారి ట్రాఫిక్ పోలీసులను ప్రశంసిస్తున్నారు. ఇదే సమయంలో నగరంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని జనం కోరుతున్నారు. ముఖ్యంగా స్కూలు, కాలేజీ ప్రాంతాలు, బైపాస్ రోడ్లు, కాలనీల దగ్గర వేగాన్ని నియంత్రించే చర్యలు తీసుకోవాలనేది ప్రజల అభిప్రాయం.
Auto Stunt : రేస్ ట్రాక్ కాదు.. రోడ్డే
రోడ్డు అనేది రేస్ ట్రాక్ కాదు… స్టంట్ల వేదిక కాదు. ఒక్క క్షణం నిర్లక్ష్యం అనేక కుటుంబాల భవిష్యత్తును చీకటిలో నెట్టేస్తుంది. ఇటీవల మద్యం సేవించి బైక్ నడపడం వల్ల.. ఓ యువకుడు తన ప్రాణాలను పోగొట్టుకోవడమే కాకుండా అతని నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల (Bus Accident) బస్సు ప్రమాదం జరిగి 19 మంది సజీవ దహనమైన (19 person spot Dead) సంగతి విధితమే.కర్నూలులో జరిగిన ఈ ఘటన… ట్రాఫిక్ నియమాలను పాటించాల్సిన అవసరాన్ని మరోసారి గుర్తు చేస్తోంది. పోలీసుల హెచ్చరికలతో ఆ డ్రైవర్లు మార్పు చెందితేనే సమాజానికి మంచిది. లేకపోతే… రోడ్లపై జరిగే ప్రమాదాల శాతం తగ్గడం దుర్లభమవుతుంది.
Auto Stunt : 100కు ఫోన్ చేద్దాం
ఎవరైనా ఈ విధంగా ఆటోలతో స్టంట్ లు, రాష్ డ్రైవింగులు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసినట్లయితే కర్నూల్ ట్రాఫిక్ పోలీసులకు గాని , డయల్ 112 కి గాని, డయల్ 100 కి గాని (Dail 100) సమాచారం అందించాలని కర్నూల్ ట్రాఫిక్ సీఐ మన్సురుద్దీన్ ( Trafific CI Mansuruddin) కర్నూల్ పట్టణ ప్రజలకు తెలిపారు.
