Signal pole| అదుపుతప్పిన ఆటో.. డ్రైవర్ దుర్మరణం

Signal pole| పమిడిముక్కల, ఆంధ్రప్రభ : పమిడిముక్కల మండలం మంటాడ గ్రామం నుంచి వీరంకులాకు వైపు ముగ్గురు మహిళా ప్రయాణికులతో వెళుతున్న ఆటో అదుపుతప్పి (out of control) ప్రమాదానికి గురైంది. మంటాడ నుంచి ముగ్గురు మహిళా ప్రయాణికులతో వీరంకిలాకు వెళ్ళు క్రమంలో రెడ్డిపాలెం, రామాలయం చెరువు సమీపానికి రాగా, పమిడిముక్కల మండలం ముసలినకీ పాలెం చెందిన ఆటో డ్రైవర్ దేశి నాగరాజు(Auto driver Desi Nagaraju) (50)కు తీవ్ర అనారోగ్య సమస్య రావడంతో ఆటో అదుపు చేయలేక సిగ్నల్ స్తంభాన్ని ఢీ కొని, ప్రక్కన ఉన్న చెరువులోకి పడిపోయి ప్రమాదానికి గురైంది. ప్రమాదానికి గురైన ఆటో డ్రైవర్ నాగరాజు అక్కడికక్కడే మృతిచెందగా, మహిళ ప్రయాణికులను స్థానికులు రక్షించారు. స్వల్ప గాయాలైన వీరిని చికిత్స నిమిత్తం(For treatment) ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply