Attacked | భార్యపై దాడి చేసిన భర్త…

Attacked | భార్యపై దాడి చేసిన భర్త…

చికిత్స కోసం ఆసుపత్రికి తరలింపు
మృతి చెందిన భార్య, భర్త పరారి
తాండూరు పట్టణంలో ఘటన


Attacked | తాండూరు, ఆంధ్రప్రభ : కుటుంబ కలహాలతో భార్యపై భర్త దాడి (Attacked) కి పాల్పడ్డాడు. ఆసుపత్రిలో చేర్పించగా భార్య మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న భర్త పరారయ్యాడు. ఈ సంఘటన తాండూరు పట్టణం (Tandoori town) లో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన ప్రాథమిక సమాచారం మేరకు… తాండూరు మండలం కరణ్‌ కోట్ గ్రామానికి చెందిన అనూష(22) (Anusha), తాండూరు పట్టణం సాయిపూర్‌ కు చెందిన పరమేష్‌లు ప్రేమించుకున్నారు. సుమారు 8నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. పరమేష్‌ ట్రాక్టర్ పనులు, వ్యవసాయ పనులు చేసుకుంటున్నాడు. కొన్ని రోజుల నుంచి అత్తారింట్లో అనూషకు కలహాలు మొదలయ్యాయి.

ఈ క్రమంలో భర్తతో కూడా విభేధాలు జరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం అనూష (Anusha)ను భర్త కొట్టినట్లు సమాచారం. గురువారం పట్టణంలోని ఓ ప్రవేటు ఆసుపత్రికి తరలించగా.. అనూష మృతి చెందినట్లు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న భర్త పరమేష్ (Paramesh) పరారైన‌ట్లు సమాచారం. అనూష మృతి చెందినట్లు తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు తాండూరుకు చేరుకున్నారు. అనూష మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ సంఘటన పట్టణంలో కలకలం రేపింది. పూర్తి వివరాలు పోలీసుల విచారణలో వెల్లడయ్యే అవకాశముంది.

Leave a Reply