TG | అర్చకుడు రంగరాజన్‌పై దాడి.. పోలీసుల అదుపులో ఆరుగురు !
చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై దాడి ఘటన కలకలం రేపింది. ఇదిలా ఉండగా ఈ ఘటనలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది.
అర్చకుడు రంగరాజన్‌పై దాడి ఘటనలో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు రాజేంద్రనగర్ డీసీపీ తెలిపారు. వారిలో ఇద్దరు మహిళ కూడా ఉన్నారని వెల్లడించారు. నిందితులు ఖమ్మం, నిజామాబాద్‌కు చెందిన వారిగా గుర్తించగా… వీరిని రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.