బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనాసరాజు..

బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనాసరాజు..
క్యాతన్ పల్లి, ఆంధ్రప్రభ : క్యాతనపల్లి మున్సిపాలిటీ బిల్డర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అసోసియేషన్ బలోపేతం, నిర్మాణ రంగ అభివృద్ధి లక్ష్యంగా ఈ ఎన్నికలు నిర్వహించినట్లు గౌరవ అధ్యక్షుడు భీమా మల్లేష్ తెలిపారు.ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ అసోసియేషన్ కార్యకలాపాలను విస్తరింపజేస్తూ, బిల్డర్ సమస్యల పరిష్కారానికి మా సాయ శక్తుల కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పనాసరాజు, జనరల్ సెక్రటరీగా అక్కల రమేష్, కోశాధికారిగా నల్లగోని కుమార్ గౌడ్, ముఖ్య సలహాదారుగా పెద్దూరి రాములు ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా సురేందర్ గౌడ్, గుర్రం తిరుపతి, సెక్రటరీలుగా ఆడెపు విజయ్, సిరిమల్ల సుధాకర్, గట్టు నవీన్ కుమార్, బత్తుల శ్రీనివాస్, గౌరవ కార్యవర్గ సభ్యులుగా సకనవీటి శ్రీనివాస్, ముత్తె బానయ్య, ఆవుల జైపాల్ రెడ్డి,చిందంచంద్రకాంత్,లను ఎన్నుకున్నారు.
