రైతులను ఆదుకోవాలని వినతి

రైతులను ఆదుకోవాలని వినతి

కల్వకుర్తి, ఆంధ్రప్రభ : అధిక వర్షాల నేపథ్యంలో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని సీపీఎం నాయకులు ఈ రోజు ఆర్డీవో జనార్దన్ రెడ్డి కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి. ఆంజనేయులు(B. Anjaneyalu) మాట్లాడారు. అధిక వర్షాలకు పత్తి, వరి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని, పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 30 వేలు(Rs. 30 thousand per acre) నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

పంట చేతికొచ్చే దశలో వర్షాలకు నేలమట్టం కావడం బాధాకరమన్నారు. పంట నష్టం పై సంబంధిత శాఖ అధికారులతో సమగ్ర సర్వే(comprehensive survey చేయించి రైతులకు న్యాయం చేయాలని ఆంజనేయులు కోరారు. పత్తి రైతులకు కంపాస్ కిసాన్ విధానాన్ని రద్దు చేసి షరతులు లేకుండా రైతుల వద్ద సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు చేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు చిలుక బాల్ రెడ్డి(Chiluka Bal Reddy) పేర్కొన్నారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు ఏపీ. మల్లయ్య, పి. పరశురాములు, రైతు సంఘం నాయకుడు కిషోర్, టీ. చెన్నయ్య ,పర్వతాలు, బీరయ్య, యు. యాదయ్య పాల్గొన్నారు.

Leave a Reply