AP | కలుషిత నీరుతాగి ఇద్దరు మృతి – ఆరుగురికి అస్వస్థత

నంద్యాల : కలుషిత నీరుతాగి ఇద్దరు మృతి చెందగా మరో ఆరుగురు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన నం ద్యాల జిల్లా ఆత్మకూరు నీలితొట్ల వీధిలో జరిగింది. మంచి నీళ్లు తాగిన కొద్దిసేపటికే పలువురు అస్వస్థతకు గురయ్యారు. వాంతులతో తీవ్ర ఇబ్బదులు పడ్డారు. దీంతో వారిని అస్పత్రికి తరలించారు. అయితే వారిలో రహంతుల్లా (50), శివపురం గ్రామానికి చెందిన బసిరూన్ (60) ల మృతి చెందారు.మరో ఆరుగురికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే నీరు కలుషితం కావడంతోనే ఘటన జరిగినట్లు అధికారులు గుర్తించారు.

నీలితొట్ల వీధిలో మెడికల్ శిబిరం ఏర్పాటు చేశారు. నీళ్లు తాగిన వారికి రక్త పరీక్షలు నిర్వహించారు. మరోవైపు మున్సిపల్ అధికారులు అప్రమత్తమయ్యారు. మంచి నీళ్ల సరఫరా నిలిపివేశారు. స్థానికుల నుంచి నీటిని సేకరించి ల్యాబ్కు తరలించినట్లు సమాచారం.

దీనిపై మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు జిల్లా వైద్యశాఖ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రాగిరి వెంకటరమణ లు మాట్లాడుతూ వీరికి వైద్యం సకాలంలో అందిందని వీరిలో ఒకరికి క్యాన్సర్ కాగా, మరొకరు దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతూ మరణించారని తెలిపారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశాల మేరకు పారిశుధ్య పనులు చేపట్టామన్నారు. ఇంటింటికి వెళ్లి బాధితులకు అన్ని వైద్య సేవలు అందించామన్నారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామని ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని తెలిపారు. పారిశుధ్య పనులు మెరుగు పరచాలని ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబును జిల్లా కలెక్టర్ రాజకుమారి ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కోరారు. అస్వస్థతకు గురైన మరి కొంతమందికి మెరుగైన వైద్యం అందించేందుకు ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి తెలిపారు.
వాంతులు, విరే చనాలు అయినా మరికొందరిని ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలలో ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి కు తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *