AP | టిడిపి నేత రామకృష్ణ హత్య కేసులో ఇద్దరు నిందితులు అరెస్ట్

.పుంగనూరు, (ఆంధ్రప్రభ):పుంగనూరు మండలం చండ్రమాకులపల్లి పంచాయతీ కృష్ణాపురం గ్రామంలో ఈ నెల15వ తేదీన జరిగిన టిడిపి నేత రామకృష్ణ హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ మేరకు శనివారం జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు పుంగనూరు పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు.అరెస్టు చేసిన ఇద్దరు నిందితులను మీడియా ఎదుట హాజరు పరిచారు.

టిడిపి నేత రామకృష్ణ హత్య అకస్మాత్తుగా జరిగినది కాదని ఇది కేవలం కుట్ర పూరితంగా రాజకీయ ఆధిపత్యం కోసం జరిగిన హత్యగా దర్యాప్తుతో తేలినట్టు తెలిపారు. ఈ హత్యకు సంబంధించి నిందితులను గుర్తించినట్లు ఆయన తెలిపారు.

గతంలో ఇరు వర్గాలపై ఘర్షణలో పరస్పర కేసులు

మృతుడు రామకృష్ణ మంచి రైతుగా అన్యాయాలు అక్రమాలపై వ్యతిరేకంగా పోరాటం చేసి రాజకీయ కార్యకర్తగా గుర్తింపు తెచ్చుకున్నారని ఎస్పీ పేర్కొన్నారు. గత నెల 10న వైఎస్ఆర్సిపి పార్టీకి చెందిన ఏ1 వెంకటరమణ రామకృష్ణ ఇరు వర్గాలకు ఘర్షణ జరిగినట్లు తెలిపారు. ఇరువర్గాలపై కేసులు నమోదు చేసినట్లు స్పష్టం చేశారు.

కానీ స్థానిక ఇన్స్పెక్టర్ ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో ఉద్రిక్తతలు పెరిగి రామకృష్ణ ఈనెల 15న హత్యకు గురైనట్లు స్పష్టం చేశారు.

*ఈ హత్యలో 5మంది నిందితులు*

రామకృష్ణ హత్యలో ఐదు మంది నిందితులను గుర్తించినట్లు ఎస్పీ తెలిపారు. అరెస్టు అయిన ఏ1 గా వెంకటరమణ ప్రత్యక్షంగా దాడుల్లో పాల్గొన్నట్లు తెలిపారు.ఏ2 మహేష్ హత్యకు ప్రేరేపించి ఆయిదాలను సరఫరా చేసినట్లు తెలిపారు.ఏ3 త్రిలోక్ నాయుడు మరియు ఏ4 రజిని కుట్ర రచనలో పాలుపంచుకుని ప్రస్తుతం ఇద్దరూ పరారి లో ఉన్నట్లు తెలిపారు.

అరెస్టు అయిన చేసిన ఏ5 రెడ్డెప్ప రెడ్డి ఈ దాడికి మూల కర్తగా వ్యవహరించినట్లు దర్యాప్తుల తేలినట్లు ఎస్పీ తెలిపారు. పరారీలో ఉన్న నిందితులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని,అరెస్టు చేయడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు.

*ఈ హత్య రాజకీయ ఆధిపత్య పోరులో ఒక భాగం*

టిడిపి నేత రామకృష్ణ హత్య రాజకీయ ఆధిపత్యపోరులో ఒక భాగమని ఎస్పీ మణికంఠ చంద్రులు తెలిపారు. ఈ హత్యలో నిందితులు గతంలో నేర చరిత్ర కలిగిన వారుగా స్పష్టం చేశారు. నిందితులు నియోజకవర్గంలోని ప్రముఖులైన రాజకీయ నాయకులతో సన్నిహిత సంబంధాలు కలిగిన వారిని ఎస్పీ స్పష్టం చేశారు. ప్రణాళిక అబద్ధంగా జరిగిన హత్య, హత్యాయత్నం, హత్యకు కుట్ర పన్నడం, మోసపూరిత కుట్ర క్రింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.సాక్షులకు తగిన భద్రత కల్పిస్తామని అన్నారు.స్వాధీనం చేసుకున్న ఆయుధాలను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.

*లోతుగా దర్యాప్తు చేపడతాం.. న్యాయాన్ని నిలబెడతాం..*

కేసులు న్యాయ ప్రక్రియలో భాగంగా వేగంగా దర్యాప్తు చేపట్టి వివక్షతకు తావు లేకుండా న్యాయాన్ని నిలబెడతామని జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ధీమా వ్యక్తం చేశారు. నిందితులకు కఠినమైన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ప్రజలు ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని ఎస్పీ కోరారు. ప్రజలు పోలీసులకు సహకరించి శాంతి భద్రతల నెలకొల్పేందుకు సామాజిక బాధ్యత కలిగి ఉండాలని ఎస్పీ కోరారు.పుంగనూరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *