AP | గిరిజనులపై ప‌వ‌న్ కు ‘మధుర’మైన అభిమానం

ఆదివాసీల‌పై ప‌వ‌న్ మ‌మ‌కారం …
230 కుటుంబాల‌కు మామిడిపండ్లు గిప్ట్..

వెల‌గ‌పూడి – ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి (deputy cm ) , జనసేన చీఫ్ (Janasena Chief ) పవన్ కళ్యాణ్ (pawan kalyan ) గిరిజనులపై (tribles ) తనకున్న ప్రత్యేక ప్రేమను మరోసారి చాటుకున్నారు. ఏకంగా కురిడి (kuridi ) గ్రామస్తుల కోసం నోరూరించే మామిడిపండును (Mangoes )పంపించారు. మన తోటలో ఆర్గానిక్ పద్ధతిలో సాగు చేసి పండించిన మామిడి పండ్లను గిరిజనులకు ఇవ్వాలని సిబ్బందికి ఆదేశించారు. దీంతో ప్రత్యేక వాహనంలో కురిడి గ్రామానికి చేరుకున్న డిప్యూటీ సీఎం కార్యాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి మామిడి పండ్లను పంపిణీ చేశారు. దాదాపుగా 230 వరకు గడపలుండే కురిడి గ్రామంలో ఇంటికి అరడజను చొప్పున మధురమైన మామిడి పండ్లను అందించారు. మా పవన్ కళ్యాణ్ సారు పంపిన మామిడి పండ్లు అంటూ పిల్లలు పెద్దలు ఇష్టంగా తిన్నారు. పవన్ సారు చల్లంగా ఉండాలంటూ ఆశీర్వదించారు.

ప్రజలపై ఆయనకు ఉన్న ప్రేమ, మమకారం ఈ చర్యలో స్పష్టంగా కనిపిస్తోంది. సాధారణ రైతుగా ఉన్న తన నేపథ్యాన్ని మర్చిపోకుండా, ప్రజలతో గాఢమైన అనుబంధాన్ని కొనసాగిస్తూ పవన్ కళ్యాణ్ చూపిన ఈ అందమైన చర్య గ్రామస్థుల మన్ననలు అందుకుంది. ‘మా పవన్ కల్యాణ్ సారు పంపిన మామిడి పండ్లు’ అంటూ పిల్లలు,పెద్దలు ఇష్టంగా వాటిని తిన్నారు.
కాగా, ఇటీవల’అడవి తల్లి బాట’ కార్యక్రమంలో భాగంగా అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటించారు. డుంబ్రిగూడ మండలం పెద్దపాడు, కురిడి గ్రామాలకు వెళ్లారు. ఆయా గ్రామాల రహదారి కష్టాలు తీర్చేందుకు అక్కడ రహదారి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం గ్రామస్థులతో మాట్లాడి వారి కష్టాలు అడిగి తెలుసుకున్నారు. అప్పుడు ఏర్పడిన అనుబంధంతోనే ఇప్పుడు వారికి తన తోటలోని పండ్లను పంపించారు. గతంలో పెద్దపాడు గ్రామస్ధులకు చెప్పులు అందజేశారు.

Leave a Reply