AP | కొడాలి నానికి షాక్ – లుకౌట్ నోటీసులు జారీ

విజయవాడ: మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని ఊహించని షాక్ తగిలింది. మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నానిపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. దేశంలో అన్ని విమానాశ్రయాలకు, పోర్టులకు ఈ సర్క్యూలర్‌ను పోలీసులు పంపారు.

కొడాలి నానిపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి.ఇటీవల ఆయన ముంబైలో గుండెకు శస్త్రచికిత్స చేయించుకున్నారు. అనంతరం అమెరికా వెళ్తారని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో ఆన్‌లైన్ ద్వారా పోలీస్ అధికారులు కొడాలి నానిపై ఎల్‌వోసీ జారీ చేశారు.

ఇది ఇలా ఉండగా…. ఇటీవల కొడాలి నాని కి ఆపరేషన్ జరిగిన సంగతి తెలిసిందే. మొదటి హైదరాబాదులో జాయిన్ అయిన కొడాలి నాని ఆ తర్వాత ముంబైకి వెళ్లిపోయారు. అక్కడ గుండెకు సంబంధించిన ఆపరేషన్ చేయించుకున్న తర్వాత… ఏపీకి రాకుండా విదేశాలకు వెళ్ళినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వల్లభనేని వంశీ జైల్లో ఉన్నాడు. నెక్స్ట్ కొడాలి నానిని అరెస్టు చేస్తారని ముందు జాగ్రత్తగా విదేశాలకు వెళ్లారని చెబుతున్నారు.

Leave a Reply