AP liquor case | మిథున్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా..

విజయవాడ: ఏపీ లిక్కర్ కుంభకోణం కేసులో రిమాండ్‌లో ఉన్న వైసీపీ నేత మిథున్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణను ఆగస్టు 1వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. మిథున్‌రెడ్డితో పాటు ఈ కేసులో మరో ఐదుగురు నిందితులు — వెంకటేష్ నాయుడు, నవీన్, ధనుంజరు, కృష్ణమోహన్, గోవిందప్పల బెయిల్ పిటిషన్లపై విచారణను కూడా అదే తేదీకి వాయిదా వేసింది.

అదే సమయంలో వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ల బెయిల్ పిటిషన్లపై విచారణను జూలై 31వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర సిట్ అధికారులకు ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఇక మరోవైపు లిక్కర్ స్కాం కేసులో ఉన్న ఇతర నిందితులపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసినట్టు సిట్ వెల్లడించింది. ఇప్పటికే విదేశాలకు పారిపోయిన నిందితులను ఏపీకి రప్పించేందుకు చర్యలు ప్రారంభించినట్టు సమాచారం.

Leave a Reply